BJP MLA Usha Thakur News: మధ్య ప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హసల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ... ఓట్లు అమ్ముకోవడం పెద్ద పాపమని హెచ్చరించారు. బీజేపీకి ఓట్లు వేయకుండా నోటుకో, లిక్కర్ బాటిల్‌కో, ఓ చీరకో ఓటు అమ్మకోవడం పాపం అన్నారు. అలాంటి వాళ్లంతా వచ్చే జన్మలో గొర్రెలుగా, ఒంటెలుగా,కుక్కలుగా పిల్లులుగా పుడతారని అన్నారు. ఇది మైండ్‌లో పెట్టుకొని దేశ సంప్రదాయాలు, సంస్కృతి గురించి మాట్లాడే బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని అన్నారు.
ఇక్కడితే ఆగిపోలేదు ఈ ఉషామేడం. దేవుడితో నిత్యం మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. "నేను దేవుడితో నేరుగా మాట్లాడతాను. ఇది బాగా అర్థం చేసుకోండి." ప్రతి నెల వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో వేల రూపాయలు పడుతున్నాయి. వీటిని కాదని ఐదు వందలకో వెయ్యిరూపాయలకో మీ ఓటు అమ్ముకుంటే సిగ్గుచేటు అని ఘాటుగా మాట్లాడారు.
గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన ఉషా ఠాకూర్‌మధ్య ప్రదేశ్ మాజీ మంత్రి ఉషా ఠాకూర్ గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. దసరా నవరాత్రుల్లో వచ్చే గార్బా ఫెస్టివల్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గార్బా నృత్యం చేస్తున్న వారి ఐడీ కార్డులను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఐడీ కార్డు లేని వాళ్లను ఆ వేడుక వద్దకు రానీయొద్దని ప్రభుత్వానికి రిక్వస్ట్ చేశారు. నవరాత్రి వేడుకలు శక్తిని ఇస్తాయని అన్నారు. అలాంటి పవర్‌ఫుల్ వేడుకతో సమాజం తన శక్తిని పెంచుకుటుందన్నారు.
అందుకే ఐడీ కార్డు అనేది తప్పనిసరి చేయాలని ఉషా అన్నారు. గార్బా ఆడేందుకు వచ్చిన వాళ్లెవరూ తమ గుర్తింపును దాచుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఐడీ చూపించిన వాళ్లు ఫ్యామిలీతో వచ్చి వేడుకల్లో పాల్గొన వచ్చని తెలిపారు. ఇక్కడకు వచ్చి లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.