Electricity Tower: ఇదేమైనా బాగుందా.. స్వీట్స్, సెల్ ఫోన్ కావాలంటే షాప్ వెళ్లు.. విద్యుత్ టవర్ పైకి ఎందుకు?

స్వీట్లు, సెల్ ఫోన్ కావాలంటే.. ఏం చేస్తారు. దుకాణం దగ్గరకు వెళ్తారు.. లేదా ఇంట్లో వాళ్లు కొనిచ్చే వరకు వెంటపడతారు. కానీ ఓ వ్యక్తి.. కరెంట్ తీగలపైకి ఎక్కాడు.

Continues below advertisement

బీహర్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లాలోని బర్మత్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి హై ట్రాన్స్‌మిషన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. ఈ కారణంగా  ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. అయితే ఓ వ్యక్తి విద్యత్ టవర్ పైకి ఎక్కడం వెనక.. వింతైన కోరిక ఉంది. తీరే కోరికనే.. కానీ.. అతడు ఎందుకంత సీరియస్ గా తీసుకొని ఎక్కాడో అతడికే తెలియాలి. కాస్త కాలు జారితే ప్రాణాలు పోయే పరిస్థితి. 

Continues below advertisement

అయితే పైకి ఎక్కిన వ్యక్తి అక్కడి నుంచి తనకు మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని అడుగుతూనే ఉన్నాడు. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. అసలు హై ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్‌ మీద కూర్చొన్నను అనే భయమే లేదు అతడికి. ఎంత ప్రయత్నించినా అతడు కిందకు దిగి రాలేదు. వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)ని పిలిచారు. ఓ వైపు చలి తీవ్రత ఎక్కువ ఉన్నా.. అతడు చొక్కా ధరించి మాత్రమే పైన ఉన్నాడు.  

అతడిని కిందకు దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఎస్ హెచ్ ఓ సత్యేంద్ర మిశ్రా చెప్పారు. అయితే అతడి గురించి చుట్టుపక్కల వారిని విచారించగా.. మానసిక వ్యాధిగ్రస్తుడని తెలిసిందని ఆయన తెలిపారు. గతంలో కూడా ఇలా పైకి ఎక్కేవాడని.. మానసిక వికలాంగుడని స్థానికులు చెబుతున్నారు.  

మరోవైపు బీహార్‌లోని సివాన్ జిల్లాలోనూ ఓ ఘటన జరిగింది. ఓ మానసిక రోగి తన ముగ్గురు కొడుకులతోపాటు కుమార్తెను చంపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం బెల్హా గ్రామంలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ.. నిందితుడి భార్య, అతని ఇతర కుమార్తె ఇంట్లో నుండి పారిపోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన నిందితుడు పదునైన ఆయుధాన్ని పట్టుకుని తన పిల్లలు, భార్యపై దాడి చేయడంతో ముగ్గురు చనిపోయారు.

Also Read: Indian Constitution: భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి.. రక్తదానమే గిఫ్ట్.. అవయవ దానమే ఆశీర్వాదం

Also Read: Sub Inspector Recruitment Exam: హైటెక్ కాపీ రాజా.. పోలీస్ పరీక్షకే వచ్చి ఈ తలతిక్క ఐడియాలేంటయ్యా..

Also Read: Omicron Restrictions: దేశంలో ఒమిక్రాన్ ప్రకంపనలు... మళ్లీ రాష్ట్రాల్లో మొదలైన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు... మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement