అసలే వేసవి . ఆ పైన విద్యుత్ సమస్యలు. ఇప్పుడు దేశం మొత్తం విద్యుత్ సమస్య ఉంది. చాలా రాష్ట్రాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కూడా దొరకని పరిస్థితి . అందుకే కోతలు తప్పడం లేదు. ఈ పరిస్థితులను సోషల్ మీడియాలో మీమర్స్ ఫన్ క్రియేట్ చేసేందుకు ఉపయోగించుకుటున్నారు. అదే సమయంలో ప్రభుత్వాల తీరునూ వదిలి పెట్టడం లేదు
పవర్ కట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. ఆ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ధోనీ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ విద్యుత్ పంపిణీ పరిస్థితి ఎలా ఉందో.. ఒక మీమ్‌లో నవ్వుకునేలా పోస్ట్ చేశాడో నెటిజన్.
కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా పవర్ కట్స్ ఉన్నాయి. ఎంత మంది ఫిర్యాదు చేసినా ఒకే సమాధానం వస్తోంది.
పంజాబ్‌లో ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తామని సీఎం భగవంత్ మన్ ప్రకటించారు. కానీ ఫ్రీగా వద్దని.. కరెంట్ ఇవ్వాలని అక్కడి ప్రజలు ట్వీట్లు పెడుతున్నారు.