Meerut Crime News: మీరట్‌కు నేవీ ఆఫీసర్‌ సౌరభ్ రాజ్‌పుత్‌ను మర్డర్ కేసులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 3న అతన్ని చంపేసిన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా తర్వాత రోజు హిమాచల్‌ టూర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చి సౌరభ్‌ డెడ్‌బాడీని మాయం చేద్దామని ప్లాన్ చేశారు. కానీ వాళ్ల కథ అక్కడ అడ్డం తిరిగింది. 

Continues below advertisement


మార్చి 3న సౌరభ్‌ను ముస్కాన్, సాహిల్ చంపేశారు. అనంతరం ఆ డెడ్‌బాడీని 15 ముక్కలుగా కట్ చేసి డ్రమ్‌లో వేశారు. అందులో సిమెంట్ వేసి కప్పేశారు. అనంతరం ఇద్దరూ కలిసి హిమాచల్ టూర్‌కు వెళ్లారు. వచ్చేసరికి డ్రమ్‌లో సిమెంట్‌ పూర్తిగా ఎండిపోయి ఉంటుందని తర్వాత దాన్ని ఎక్కడైన దూరంగా పడేయొచ్చని ప్లాన్ చేశారు.  


నిందితులు హిమాచల్‌ టూర్‌ నుంచి మార్చి 17న తిరిగి వచ్చి కొందరు కూలీలను పురమాయించింది ముస్కాన్. ఆ డ్రమ్‌ను ఎక్కడైనా పడేయాలని చెప్పింది. డ్రమ్‌ చూడటానికి చిన్నదిగా కనిపిస్తుందని ఆ డ్రమ్‌ పడేసేందుకు వాళ్లు ఒప్పుకున్నారు. అయితే వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆ డ్రమ్‌ ఎత్తలేకపోయారు. ట్రై చేస్తున్న క్రమంలోనే దాని డ్రమ్‌ పడిపోయింది. దీంతో దాని మూత విడిపోయింది. ఇంతలో అందులో నుంచి భయంకరమైన దుర్వాసన వచ్చింది. 


డ్రమ్‌ నిండా సిమెంట్ పూసి ఉండటం... మరోవైపు డ్రమ్‌ నుంచి దుర్వాసన రావడంతో కూలీలకు అనుమానం వచ్చింది. ఏదో తేడాగా ఉందని గ్రహించిన కూలీలు తమ వల్ల ఆ పని కాదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడైతే డ్రమ్ కప్పు ఊడి రావడంతోనే ఆ ప్రాంతమంతా దుర్వాసన కమ్మేసింది.


ఒక్కసారిగా అలా జరగడంతో ముస్కాన్ షాక్ తిన్నది. అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్టు డ్రమ్‌ను మళ్లీ సరి చేసి పెట్టి భయపడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేరుగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ముస్కాన్ తీరు చూసిన తండ్రిదండ్రులు ఏం జరిగిందని నిదీశారు. దీంతో సౌరభ్‌ను సోదరి, బావ చంపేశారని వాళ్లపైకి నెట్టేసే ప్రయత్నం చేసింది. కానీ అది వీలు కాలేదు. తల్లిదండ్రులు గుచ్చి గుచ్చి అడగడంతో నిజం ఒప్పేసుకుంది. తానే హత్య చేసినట్టు అంగీకరించింది. 


ముస్కాన్‌ చెప్పిన మాటలకు షాక్ తిన్న తల్లిదండ్రులు నేరుగా ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగింది చెప్పారు. సాహిల్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు ఆమె అంగీకరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు వాళ్లు వెకేషన్‌కు వెళ్లిన వీడియోలు కూడా తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత టూర్‌కు వెళ్లిన సాహిల్, ముస్కాన్‌ ఎక్కడ కూడా తప్పు చేశామన్న బాధ లేకుండా ఎంజాయ్ చేశారు.  


సాహిల్, ముస్కాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు జుడీష్యియల్ కస్టడీకి తరలించారు. మీరట్‌లో ఉండే ముస్కాన్‌ ఇంటికి సాహిల్ తరచూ వచ్చే వాడని స్థానికులు చెబుతున్నారు. స్థానికులతో ఆమె చాలా మంచిగా ఉండేదని కలివిడిగా అందరితో కలిసిపోయేదని చెబుతున్నారు. అసలు ఆమె ఇలాంటి పని చేస్తుందని ఎవరూ అనుకోలేదని అంటున్నారు.  


మర్చంట్ నేవీ అధికారి అయిన సౌరభ్‌తో ముస్కాన్‌కు  2016లో వివాహమైంది. వీళ్లకు ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. మొదటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు వస్తూ ఉండేవి విడివిడిగానే ఉంటూ వచ్చారు. 2019లో సాహిల్‌తో ఉన్న సంబంధాన్ని సౌరభ్‌ గుర్తించాడు. అప్పుడే విడాకులు తీసుకోవాలని అనుకున్నాడు కానీ పాప కోసం తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు. తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇప్పుడు వచ్చి ఇలా వారి చేతిలో బలైపోయాడు.