92nd Air Force Day: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు (అక్టోబర్ 6) తమిళనాడులోని చెన్నై మెరీనా ఎయిర్ ఫీల్డ్ లో ఎయిర్ అడ్వెంచర్ షో నిర్వహించారు. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక దళ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ ఎయిర్ అడ్వెంచర్ షోలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పాల్గొన్నారు. 21 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెన్నైలో నిర్వహిస్తున్న మెరీనా బీచ్‌లో గరుడ కమాండోలు తమ బలాన్ని ప్రదర్శించారు. వేలాది మంది ప్రజలు ఆదివారం రోజున అక్కడికి చేరుకుని, రాఫెల్‌తో సహా భారత వైమానిక దళం అద్భుతమైన విన్యాసాలను వీక్షించారు. అక్టోబరు 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐఏఎఫ్ విమానం అద్భుతమైన వైమానిక ప్రదర్శన చెన్నై ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా మెరీనా బీచ్‌లో అద్బుతమైన ఎయిర్ షోతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది.
షోకు హాజరైన ప్రముఖులులైట్‌హౌస్, చెన్నై పోర్ట్ మధ్య మెరీనాలో జరిగిన 92వ వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, చెన్నై మేయర్ ఆర్ ప్రియా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకే మెరీనా బీచ్ వద్ద ఉత్సాహంగా ప్రజలు గుమిగూడారు. చాలా మంది గొడుగులు పట్టుకుని మండుతున్న ఎండల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక గరుడ దళానికి చెందిన కమాండోలు మాక్ రెస్క్యూ ఆపరేషన్, బందీలను విడిపించడంలో తమ సాహసోపేత నైపుణ్యాలను ప్రదర్శించడంతో ఎయిర్ షో ప్రారంభమైంది.
లిమ్కా రికార్డు సృష్టించడం ఎయిర్ ఫోర్స్ కలచెన్నైలోని మెరీనా బీచ్‌లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు కూడా ప్రయత్నించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రెండు గంటల వైమానిక ప్రదర్శనకు దాదాపు 15 లక్షల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. ఎయిర్ షోలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొనడం వల్ల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుని చరిత్ర సృష్టించాలని ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఎక్సర్ సైజ్ లతో పాటు సాగర్, ఆకాష్, బాణం, త్రిశూల్, రుద్ర, ధ్వజ్ వంటి నిర్మాణాలను కూడా ప్రదర్శించారు. దాదాపు 72 విమానాలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రాఫెల్ సహా దాదాపు 50 విమానాలు పాల్గొన్నాయి. హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ డకోటా, హార్వర్డ్, తేజస్, ఎస్ యూ-30, సారంగ్ కూడా ఏరియల్ సెల్యూట్ లో పాల్గొన్నాయి. ఎయిర్ షో సందర్భంగా మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించారు.
