Heart Attack:
మాల్‌లో గుండెపోటు..
గుండెపోటు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. అప్పటి వరకూ మామూలుగానే మాట్లాడిన వ్యక్తి ఉన్నట్టుండి కుప్ప కూలిపోతున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లు అక్కడికక్కడే నేలకొరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కొందరు జిమ్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా చనిపోతున్న వారిలో 30 ఏళ్ల లోపు వాళ్లూ ఉన్నారు. యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. లఖీంపురి ఖేరి ప్రాంతంలోని ఓ మల్టీప్లెక్స్‌లో ఓ వ్యక్తి సినిమా చూసేందుకు వచ్చాడు. లోపలికి వస్తుండగానే కుప్ప కూలాడు. అతని ముందు నడుస్తున్న ఇద్దరు ఏదో శబ్దం అవడాన్ని గమనించి వెనక్కి తిరిగారు. చూస్తే ఓ వ్యక్తి నేలపై పడి ఉన్నాడు. వాళ్లకేం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోయారు. కాసేపటి తరవాత సెక్యూరిటీ గార్డ్‌లు వచ్చారు. రాత్రి పూట ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మృతుడి పేరు అక్షత్ తివారిగా గుర్తించారు. ఓ మెడికల్ షాప్‌ని నడుపుతున్న తివారి...సినిమా హాల్‌లోకి వచ్చేప్పుడు మెట్లు ఎక్కుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు. అలా లోపలికి వచ్చీ రాగానే కింద పడిపోయాడు. సెక్యూరిటీ గార్డ్‌లు వచ్చి ముఖంపై నీళ్లు చల్లారు. కళ్లు తిరిగి కింద పడిపోయి ఉంటాడని భావించారు. కానీ ఎంత సేపైనా ఉలుకు పలుకు లేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. గుండెపోటుతోనే చనిపోయినట్టు ధ్రువీకరించారు.
కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు..
గుజరాత్‌లో ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ (Dr Gaurav Gandhi) గుండెపోటుతో మృతి చెందారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజాము నిద్రలోనే గుండెపోటుతో చనిపోయారు. అత్యంత యువ కార్డియాలజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆయన...గుండెపోటుతో చనిపోయారన్న వార్త అందరినీ షాక్‌కి గురి చేసింది. రోజూ లాగానే హాస్పిటల్‌కి వెళ్లి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నారని, తెల్లారి ఎంతకీ నిద్ర లేకపోవడం వల్ల అనుమానం వచ్చి చూస్తే నిర్జీవంగా పడి ఉన్నారని పోలీస్‌లు వెల్లడించారు. అయితే...గుండెపోటుకి సంబంధించిన ఎలాంటి లక్షణాలు ఆయనలో కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. కనీసం నొప్పిగా ఉందని కూడా ఏమీ చెప్పలేదని, ఉన్నట్టుండి గుండెపోటుతో నిద్రలోనే చనిపోవడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటలకు నిద్రలేస్తారు గౌరవ్. అప్పటికీ ఆయన లేవకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వరుస పెట్టి కాల్స్ చేశారు. అయినా రెస్పాండ్ అవ్వలేదు. వెంటనే గదిలోకి వెళ్లారు. బెడ్‌పై అచేతనంగా పడి ఉన్న ఆయనను చూసి షాక్ అయ్యారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. 41 ఏళ్ల గౌరవ్ గాంధీ...తన కెరీర్‌లో 16 వేల హార్ట్ సర్జరీలు చేశారు. ఇప్పుడు ఆయనే హార్ట్ ఎటాక్‌తో కన్ను మూశారు.
Also Read: Muzaffarnagar School Slap Incident: చెంపదెబ్బ కేసు- బాలుడి ఐడెంటిటీ బహిర్గతం చేయడంపై ఎఫ్‌ఐఆర్