దూరం చూస్తే టాప్ లేపేసిన ఎఫ్ వన్ రేస్ కార్ లా ఉంటుంది. దగ్గరకు వచ్చే కొద్దీ  ఎలాంటి వాహనమో గుర్తించడం కష్టమవుతుంది. ఆ వాహనాన్ని దాటి ముందుకెళ్లిన తర్వాతే ..  అలాంటి వాహనం మనంఎక్కడా చూసి ఉండలేదని తెలుస్తుంది. అది మన లాంటి సామాన్యులకే కాదు.. ఆనంద్ మహింద్రా లాంటి ఆటోమోబైల్ దిగ్గజానికి కూడా అలాగే అనిపిస్తోంది. అందుకే ఆ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. అదేంటో మీరే చూడండి. రోడ్స్ ఆఫ్ ముంబై అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను ట్వీట్ చేసింది.  



ఆ వీడియోలో పాల క్యాన్లను తాను సొంతంగా తయారు చేసుకున్న వాహనంలో డెలివరీ ఇవ్వడానికితీుకెళ్తున్నాడు.  కేవలం రాడ్‌లతో ఆ వాహనాన్ని డిజైన్ చేశారు. అది కూడా త్రీ వీలర్.  మూడు చక్రాల ఆ వాహనం చూస్తే ఎవరైనా అబ్బురపడకుండా ఉండరు. అది పూర్తిగా రేసింగ్ కారు లా ఉంది. ఆ వ్యక్తి కూడా వెనుక పాల క్యాన్‌లను పెట్టుకుని ముందు కూర్చుని ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. రేసింగ్  కారులో డ్రైవింగ్ చేసినట్టుగానే ఆయన కూడా ఆ కొత్త రకమైన వాహనాన్ని నడిపాడు. ఆ వాహనం రోడ్డుపై వేగంగా దూసుకెళ్తూ ఉంటే ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు.  



 ఈ వాహనం రోడ్డు నిబంధనలకు లోబడి ఉన్నదా? లేదా? అనే విషయాన్ని తాను చెప్పలేనని, కానీ, వాహనాలపై ఆయన ప్యాషన్‌ మాత్రం ఎవరూ నియంత్రించలేనిదని కామెంట్ చేశారు. ఆ రోడ్డు వారియర్‌ను తాను కలువాలని అనుకుంటున్నట్టు తెలిపారు. 


ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఈ వీడియో చూస్తే.. బ్యాట్‌మ్యాన్ పాలను అమ్ముతున్నట్టు ఉన్నదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అనేక మంది స్పందిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిపోయింది.