Mamata Banerjee: నరేంద్ర మోదీ సర్కార్‌పై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఫైర్ అయ్యారు. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి తగ్గించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నిర్ణయమని మండిపడ్డారు.
చందాదారులకు షాక్
పీఎఫ్ చందాదారులకు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) షాక్ ఇచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ నిల్వపై వడ్డీ రేటు 8.10 శాతంగా నిర్ణయించింది. ఇది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ వడ్డీ రేటు. 40 ఏళ్ల నుంచి కనీసం 8.5 శాతం వడ్డీ ఉంటూ వస్తోంది. ఇప్పుడు అతి తక్కువ శాతానికి తగ్గించారు. ఈ మేరకు శనివారం ఈపీఎఫ్‌ఓ నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ( CBT ) సమావేశమై నిర్ణయం తీసుకుంది. 8.1శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సీబీటీ.. కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది.
Also Read: Russia Ukraine Crisis: భారత భద్రతా సన్నద్ధతపై మోదీ సమీక్ష- రష్యా- ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ