Russia Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతోన్న వేళ భారత భద్రతా సన్నద్ధత, అంతర్జాతీయ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయ్‌శంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి హర్ష వర్థన్ ష్రింగ్లా హాజరయ్యారు.







ఆపరేషన్ గంగా


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ గంగా'పై ఇప్పటికే చాలా సార్లు ప్రధాని మోదీ ఇలాంటి సమీక్షలు నిర్వహించారు. బడ్డెట్ సమావేశాల రెండో విడతలో 'ఆపరేషన్ గంగా' గురించి పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్.


ఆపరేషన్ గంగాతో పాటు రష్యా, ఉక్రెయిన్ వివాదంపై భారత్ స్టాండ్ ఏంటి అనే అంశంపై కూడా జయ్‌శంకర్‌ పార్లమెంటులో మాట్లాడనున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగాను కేంద్రం ప్రారంభించింది. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, హర్‌దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ వీకే సింగ్‌లను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపి.. విద్యార్థులను తరలించింది. 


ఎంతమంది?


ఆపరేషన్‌ గంగాలో భాగంగా 80 ప్రత్యేక విమానాల్లో దాదాపు 20 వేల మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేర్చారు. అలాననే బంగ్లాదేశ్, నేపాల్ విద్యార్థులను కూడా తీసుకువచ్చింది. ఇందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు సహకరించినట్లు కేంద్రం పేర్కొంది. ఇరుదేశాల అధ్యక్షులకు ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: Ukraine: జీవరసాయన ఆయుధాలు అంటే ఏమిటి? పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మనుషులను సైలెంట్‌గా ఎలా చంపుతాయి?


Also Read: Yogi Adityanath Modi Meeting: ప్రధాని మోదీతో ఆదిత్యనాథ్ భేటీ- యోగి 2.0 కేబినెట్‌లో కీలక మార్పులు తప్పవా?