Maharashtra New CM: నవంబర్ 27 లేదా 28న తేదీల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇవాళ సీఎంను ఎంపిక చేసి నవంబర్ 26లో ప్రమాణ స్వీకారం చేయాలని మహాయుతి పార్టీలు భావించాయి. కానీ సీఎం ఎవరూ అనే విషయంలో పంచాయితీ తేలకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదాపడినట్టు తెలుస్తోంది. 


మంగళవారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని ముందుగానే ప్రకటించినప్పటికీ ఇది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని వెనుక రెండు మూడు ముఖ్యమైన కారణాలున్నాయి. పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉన్నందున తొందరపాటు లేకుండా సరైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మహాయుతి పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగాల్సి ఉందని, ఆ తర్వాత అమిత్ షా, షిండే-ఫడ్నవీస్-అజిత్ పవార్ మధ్య సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. అందువల్ల 27 లేదా 29 తేదీల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 



మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాల తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఎప్పుడు జరుగుతుందనే చర్చ మొదలైంది.. ప్రస్తుత విధానసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం తప్పనిసరి, లేకుంటే రాష్ట్రపతి పాలన ఉంటుంది. అయితే ఈ అభిప్రాయం తప్పని పలువురు న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. 26న ప్రమాణస్వీకారం చేయకుంటే అర్ధరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి పాలన మొదలవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 


ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఏకనాథ్ షిండే సూచనప్రాయంగా ప్రకటన చేశారు. షిండే ఎమ్మెల్యేలందరి సమావేశం ముంబైలో జరిగింది, ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేశారు. ప్రక్రియ మొదలైందని ముఖ్యమంత్రి షిండే సూచనప్రాయంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మీ ఫేస్‌ వల్లే మహాయుతి లాభపడిందని, మీరే ముఖ్యమంత్రి కావాలని ఏకనాథ్ షిండే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ ముఖ్యమంత్రి పదవి కారణంగానే మహాయుతిలో భిన్నాభిప్రాయాలు పెరుగుతున్నాయని అంటున్నారు. 


దీనిపై స్పందించిన షిండే మహాకూటమి ఐక్యంగా ఉందని అన్నారు. చీలికలు తీసుకొచ్చే ప్రకటనలు వద్దని తన వర్గ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సూచించినట్లు సమాచారం. ముంబైలో జరిగిన శివసేన ఎమ్మెల్యేల సమావేశానికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. గెలుపులో ఆర్‌ఎస్‌ఎస్ కృషిని సీఎం మెచ్చుకొని ధన్యవాదాలు తెలిపారు. 


క్లియర్ మైండ్‌తో ప్రజలకు మహాయుతికి అధికారం ఇచ్చారు. కానీ సీఎం ఎవరూ అనే విషయాన్ని పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కుతుందని మహాయుతి నేతలు ఏబీపీ మజాకు సమాచారం ఇచ్చారు. మూడో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓటు వేస్తోంది. ఎన్సీపీకి చెందిన నేతలంతా తీర్మానం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించినందు వల్ల ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ హైకమాండ్ ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ పేరుపై తమకు అభ్యంతరం లేదని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించడంతో మిగిలింది షిండే ఒక్కరే. ఇలా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు భారీగా మద్దతు ఉంటోంది.  


సంఘ్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు లభించడానికి కారణాలు... 



  • దేవేంద్ర ఫడ్నవీస్ సంఘ్ వాలంటీర్. 

  • రాజకీయ లాభనష్టాల గురించి ఆలోచించకుండా సంఘ్ స్వయంసేవకుడిననే విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ఎప్పుడూ దాచుకోలేదు. 

  • ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో యూనిఫామ్‌తో పాల్గొంటారు. 

  • దేవేంద్ర ఫడ్నవిస్ నాగ్‌పూర్‌కు చెందినవారు కాబట్టి, సంఘ్‌లోని అన్ని స్థాయిల్లోని నాయకులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారు.

  • మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత సంఘ్‌ పరివార్‌కు చెందిన అన్ని సంస్థలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కష్టప‌డ్డాయి. 

  • అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ అంశాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ బలంగా లేవనెత్తారు.

  • ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలాంటి అంశాలను టచ్ చేయలేదు.

  • ఫడ్నవీస్‌తో పోలిస్తే మహారాష్ట్రలోని ఇతర నేతలకు అభివృద్ధి, హిందుత్వ, అన్ని కులాలతో కలిసి ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం లేదు.

  • మహారాష్ట్రలో గత 15 ఏళ్ల రాజకీయ గందరగోళంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలను కలిసి ఉంచడంలో ఫడ్నవీస్ విజయం సాధించారు .

  • ఫడ్నవీస్‌కి సంబంధించిన ఈ విషయాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ హైకమాండ్‌కు బాగా తెలుసు.


అయితే ముఖ్యమంత్రి పదవిలో దేవేంద్ర ఫడ్నవీస్ కూర్చుంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూర్చున్న ఏక్నాథ్ షిండే పరిస్థితి ఏమిటి? ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా కూర్చుంటారా ? అనేది సస్పెన్స్‌గా మారింది. 


Also Read: మహారాష్ట్రలో ఇంచార్జులుగా పని చేసిన ఏపీ బీజేపీ నేతలకు మంచి ఫలితాలు - హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేసినట్లే !