New Army Chief: భారత నూతన సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం నరవాణే స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పాండే నియమితులయ్యారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు.
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే. ఆయన నియామకంపై ప్రకటన వెలువడిన వెంటనే భారత సైన్యం ట్విటర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.
కీలక సమయంలో
పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత, శ్రీలంకలో సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, అటు రష్యా-ఉక్రెయిన్ యుద్దం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు.
- చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే.
- జనరల్ పాండే భారత సైన్యానికి 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్.
- నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాండే చదువుకున్నారు.
- బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.
- హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు.
- 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు.
- 39 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో విభిన్న వాతావరణాల్లో, వైవిధ్యభరితమైన కార్యకలాపాలకు పాండే నాయకత్వం వహించారు.
మరోవైపు ఇప్పటివరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన నరవాణేకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!
Also Read: CJI NV Ramana: సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!