Key  Leaders In Lok Sabha Election Results 2024: దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన 18వ పార్ల‌మెంటు(Parliament) ఎన్నిక‌లు(Elections) అత్యంత ఉత్కంఠ‌గా సాగిన విష‌యం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(N.D.A) కూట‌మి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ(I.N.D.I.A) కూట‌మి ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కం గా పోటీ చేశాయి. గెలుపుపై ఎవ‌రికి వారే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొన్ని గంట‌ల్లోనే ఫ‌లితం రానుంది. అయితే.. మొత్తం ఓరాల్ ఫ‌లితం ఎలా ఉన్నా.. ఈ ఎన్నిక‌ల్లో అతిర‌థ నాయ‌కుల‌తో(Prominent)పాటు.. అనేక మంది సినీ రంగ ప్ర‌ముఖులు(Cine actors) కూడా.. పోటీ చేశారు. మ‌రి వారు గెలుస్తారా?  చ‌రిత్ర సృష్టిస్తారా?  లేక‌.. ఏం జ‌రుగుతుంద‌నేది ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా... చ‌ర్చ‌నీయాంశం అయింది. 


ప్ర‌ధాని మోదీ(P.M. Modi):  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆధ్యాత్మిక న‌గ‌రం వార‌ణాసి(Varanasi). ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా మూడో సారి ప్ర‌ధాని మోదీ పోటీ చేస్తున్నారు. 2014లో తొలిసారి ఆయ‌న ఇక్క‌డ బ‌రిలో నిలిచారు. విజ‌యం ద‌క్కించుకున్నారు.. 2019లోనూ ఆయ‌ననే ఇక్క‌డి వారు గెలిపించుకున్నారు. ఇక‌, ఇప్పుడు మూడోసారి కూడా.. ఇక్క‌డే పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌రుస‌గా మూడో సారి అజ‌య్ రాయ్ పోటీలో ఉన్నారు. గ‌త రెండు సార్లు కూడా.. ఈయ‌న ఓడిపోయారు. మ‌రి ఇప్పుడు ఏమేర‌కు పోటీ ఇస్తారో చూడాలి. ఇక్క‌డ ఇండియా కూట‌మి ఈయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. 


కంగ‌నా ర‌నౌత్‌(Kungana ranout):  ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి. ఫైర్ బ్రాండ్. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌(Himachal pradesh)లోని మండి(Mandi) నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీకి కంచుకోట‌. అయితే.. 2021లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఇక్క‌డ నుంచికాంగ్రెస్ అభ్య‌ర్థిగా రాజ‌వంశానికి చెందిన విక్ర‌మాదిత్య బ‌రిలో ఉన్నారు. 


రాహుల్‌గాంధీ(Rahul gandhi):  కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్నారు. కేర‌ళ‌(Kerala)లోని సిట్టింగ్ స్థానం వ‌య‌నాడ్‌(Wayanad)లో ఆయ‌న‌కు కూట‌మి పార్టీ సీపీఐ నుంచి గ‌ట్టి పోటీ ఉంది. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి రాజా స‌తీమ‌ణి అన్నీ(Anni Raja) పోటీలో ఉన్నారు. ఇక‌, యూపిలోని సోనియాగాంధీ సొంత నియోజ‌క‌వ‌ర్గం రాయ బరేలిలో ఈ సారి ఆమె పోటీ నుంచి త‌ప్పుకొన్నారు. దీంతో ఇక్క‌డ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థిగా దినేష్ ప్ర‌తాప్ సింగ్ పోటీలో ఉన్నారు. 


రాధిక‌(Radhika):  ద‌క్షిణాది సినీ రంగంలో తిరుగులేని న‌టిగా ఉన్న రాధిక‌..తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. బీజేపీ త‌ర‌ఫున త‌మిళ‌నాడులోని విరుధ్ న‌గ‌ర్(Virudhnagar) పార్ల‌మెంటు స్థానంలో ఆమె పోటీ చేస్తున్నారు. ఈమెపై ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాణిక్కం ఠాకూర్‌, డీఎండీకే త‌ర‌ఫున విజ‌య్ ప్ర‌భాక‌ర‌న్ కూడా గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. 


త‌మిళి సై(Thamilsai):  తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఈ సారి.. కూడా అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. త‌మిళ‌నాడులోని సౌత్ చెన్నై(South chennai) నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈమెపై డీఎంకే త‌ర‌ఫున తంగ‌పాండియ‌న్ ఉర‌ఫ్ సుమతి పోటీ చేస్తున్నారు. కాగా. గ‌తంలో రెండు సార్లు పోటీ చేసిన త‌మిళిసై రెండు సార్లూ ప‌రాజ‌యం పాల‌య్యారు. 


పురందేశ్వ‌రి:  ఏపీ బీజేపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి(Purandeswari).. వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత‌.. ఇప్పుడు మ‌రోసారి అదృష్టం ప‌రిశీలించుకుంటున్నారు. రాజ‌మండ్రి నుంచి ఆమె పోటీ లో ఉన్నారు. ఇక్క‌డ నుంచి వైసీపీ స్థానిక డాక్ట‌ర్ అయినా.. గూడూరు శ్రీనివాస్‌ను బ‌రిలో నిలిపింది. మ‌రి ఎవ‌రు గెలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. 


అభిషేక్ బెన‌ర్జీ: బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్తులో అధ్య‌క్షుడిగా పేరున్న అభిషేక్ బెనర్జీ.. ఈ సారి ఎన్నిక‌ల్లో  పశ్చిమబెంగాల్ లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈయ‌న‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓడించాల‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ అభిజిత్ కుమార్‌ను నిల‌బెట్టింది. ఈయ‌న త‌ర‌ఫున ప్ర‌ధాని ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. 


మిసా భార‌తి(Misa bharathi):  బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాద‌వ్ కుమార్తె. ఈమె  బీహార్ లోని పాటలీ పుత్ర నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ(RJD)  త‌ర‌ఫున బ‌రిలో ఉన్నారు. ఇది ఇండియా కూట‌మి. అయితే.. మిసా భార‌తిని ఓడించేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది. రెండు సార్లు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న రామ్ కృపాల్ యాదవ్‌కే అవ‌కాశం ఇచ్చింది. దీంతో ఇక్కడ ఫైట్ తీవ్రంగానే ఉంది. 


ష‌ర్మిల‌(Y.S. Sharmila):  ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌..(Y.S. Sharmila) త‌న సొంత జిల్లా క‌డ‌ప(Kadapa) పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఈమె తొలిసారి ప్ర‌జాక్షేత్రంలో పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈమెపై పోటీగా సొంత కుటుంబానికే చెందిన సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బ‌రిలో నిలిచారు. ఇక్క‌డ హోరా హోరీ పోరు సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.