ప్రజ్ఞాన్‌ రోవర్‌పై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి-ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్

ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్‌-3 ప్రజ్ఞాన్‌ రోవర్‌  తిరిగి క్రియాశీలకంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు.

Continues below advertisement

ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  జాబిల్లిపై స్లీపింగ్‌ మోడ్‌లో ఉన్న చంద్రయాన్‌-3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి క్రియాశీలకంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌పై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్న ఆయన, ప్రస్తుతం జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ ప్రశాంతంగా నిద్రిపోతోందన్నారు.  ప్రజ్ఞాన్‌ రోవర్‌ ను కదిలించకుండా నిద్రపోనిద్దామన్న సోమనాథ్,  తనంతట తాను క్రియాశీలకంగా మారాలని అనుకున్నప్పుడు అది నిద్ర మేల్కోంటుందన్నారు. మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పరీక్షించినప్పుడు అది పనిచేసిందని సోమనాథ్‌ వెల్లడించారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ మళ్లీ క్రియాశీలమవుతుందని భావిస్తున్నామని చెప్పారు. 

Continues below advertisement