Know Your Polling Booth:
పోలింగ్ బూత్ వివరాలు
మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా ఈ సందడి మొదలైంది. ఎన్నికలున్న రాష్ట్రాల్లో ప్రచార సభలు హోరెత్తిస్తున్నాయి. సీనియర్ లీడర్స్ నుంచి కార్యకర్తల వరకూ అంతా బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అందరూ హామీలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే...ఓటరు ఓటు వేసే వరకూ అవగాహన కల్పించడం మరో ఎత్తు. ఓటరు కార్డు సరిచూసుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అందరికీ సరైన సమాచారం అందించాలి. ఈ ప్రాసెస్‌లో అత్యంత కీలకమైంది దగ్గర్లోని పోలింగ్ బూత్‌ని కనుక్కోవడం. దీని కోసం ఎవరిపైనా ఆధారపడకుండానే చాలా సులువుగా తెలుసుకోవచ్చు. జస్ట్ ఈ కింద ఇచ్చిన స్టెప్స్‌ని ఫాలో అయితే చాలు.
ఇలా తెలుసుకోండి..
1. ముందుగా https://eci.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తరవాత టాప్‌లో ఎడమ వైపు MENU అనే ఆప్షన్ కనిపిస్తుంది.
3. ఆ MENU పైన క్లిక్ చేస్తే కింద చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మొట్ట మొదట ELECTORS అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద చాలా సబ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ స్టేటస్‌నీ చెక్ చేసుకోవచ్చు. వీటిలో మూడో ఆప్షన్‌గా Know Your Polling Booth అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
4. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తరవాత మరో ట్యాబ్‌లో వేరే లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ https://electoralsearch.eci.gov.in/ పై క్లిక్ చేయండి. అక్కడి నుంచి మరో ట్యాబ్‌లో లింక్ ఓపెన్ అవుతుంది.
5. సైట్ ఓపెన్ చేయగానే Search in Electoral Roll అని కనిపిస్తుంది. దాని కింద మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి Search by Details, రెండోది Search by EPIC, మూడోది Search by Mobile. ఈ మూడింటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీరు ఓటు వేయాల్సిన పోలింగ్‌బూత్ వివరాలు తెలుసుకోవచ్చు.
6.ఇందులో రెండో ఆప్షన్ అయిన Search by EPIC ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. EPIC నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. EPIC అంటే Electors Photo Identification Card. ఓటర్ కార్డుపైన ఫొటో పక్కనే పది అంకెల నంబర్ ఉంటుంది. అదే EPIC Number. ఆ నంబర్‌ని ఎంటర్ చేయాలి. కుడి వైపున Select Your State అనే ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్ యారోపై క్లిక్ చేస్తే రాష్ట్రాల లిస్ట్ ఉంటుంది. అందులో మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
7. ఇక చివరిగా Captcha Codeని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తరవాత కింద Search ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన పేరు, రాష్ట్రం, జిల్లా, పోలింగ్ స్టేషన్, అసెంబ్లీ నియోజకవర్గం, సీరియల్ నంబర్...ఇలా అన్ని వివరాలు కనిపిస్తాయి. ఆ డిటెయిల్స్ నోట్ చేసుకుంటే దగ్గర్లో ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలో మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది.
Also Read: మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా.? - ఇలా చేస్తే కొత్త కార్డు పొందొచ్చు