Kerala man files complaint On rooster: లోకంలో చిత్రమైన మనుషులు ఉంటారు. అలాంటి వారిలో రాధాకృష్ణ కురూప్ అనే వ్యక్తి ఒకరు. ఆయన ఏం చేశారంటే.. ఉదయమే మూడుగంటలుక కోడి కూస్తోందని దాని వల్ల తనకు నిద్ర చెడిపోతోందని కేసు పెట్టారు.           


కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పల్లికల్అనే  గ్రామంలో  రాధాకృష్ణ నివసిస్తున్నాడు. ఆయనకు ప్రశాంతంగా సౌండ్ పొల్యూషన్ లేకుండా జీవించడం చాలా ఇష్టం. ఇంత కాలం ఆయన అలాగే బతికారు. అయితే హఠాత్తుగా ఆయన పక్కింట్లో కోడి ఒకటి కూతకు వచ్చింది.ఆ కోడి రాధాకృష్ణ కన్నా చాలా పద్దతిగా ఉంటుంది.          


ఉదయమే మూడు గంటలకు లేచి కూసే కోడి              


ఉదయమే మూడుగంటలకు నిద్ర లేస్తుంది. అలా లేవడమే కాదు.. ఊపందర్నీ నిద్ర లేపుతోంది. బిగ్గరగా కూస్తుంది. రాధాకృష్ణకు ఇది పరమ చిరాకుగా అనిపించింది.మూడు గంటలకు నిద్రలేపే కోడిపై ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆ కోడి కూతలు వినిపించకుండా చాలా ప్రయత్నాలు చేశారు. అన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన కీలక నిరణయం తీసుకున్నారు.                            


తనకు ఆరోగ్యపరంగా నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆ కోడి వల్ల నిద్రపోలేకపోతున్నానని ఆయన డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేశారు.కోడి చేస్తున్న అలజడిని భరించలేనని  దానిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ అతను అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO)కి అధికారిక ఫిర్యాదు చేశాడు.                   


నిద్రాభంగం చేస్తోందని రాధాకృష్ణ కురూప్ ఆర్డీవోకు ఫిర్యాదు            


కోడి అన్నాక కూయకుండా ఉంటుందా.. పెద్ద మనిషి చాదస్తం అని ఆర్డీవో తేలికగా తీసుకోలేదు. విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాధాకృష్ణతో పాటు కోడి యజమానితోనూ చర్చించారు. గ్రామాన్ని కూడా  పోలీసులు సందర్శించారు.   


కోళ్లను పెట్టే ప్లేస్ మార్చారని విచారణ తర్వాత ఆర్డీవో ఉత్తర్వులు                          


కోడి యజమాని కుమార్ తాను పెంచుతున్న కోళ్లను పై అంతస్తులో ఉంచడం వల్ల అవి కూసినప్పుడు డిస్ట్రబ్ అవుతుందని గుర్తించారు.  పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వతా కోడి కూతల శబ్దాన్ని తగ్గించడానికి కుమార్‌ తన కోళ్లను పై అంతస్తు నుండి తన ఆస్తి దక్షిణం వైపుకు తరలించాలని RDO ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఇందుకు పధ్నాలుగు రోజుల సమయం కూడా ఇచ్చారు. 


ఈ విచిత్రమైన వివాదం కేరళలో హాట్ టాపిక్ గా మారింది.  


Also Read: శారీరక సంబంధం లేదని ప్రేమ వివాహేతర సంబంధం కాదు - మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు