వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం కాని పురుష ఉద్యోగులంతా వరకట్నాని ప్రోత్సహించమంటూ డిక్లరేష్ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు ఇదే కేరళలో సంచలనంగా మారింది.  



సమాజంలో వరకట్నం పేరుతో జరుగుతున్న దురాగతాలని చూసిన కేరళ ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. పెళ్లిన కాని ప్రభుత్వ ఉద్యోగులు వరకట్నానికి వ్యతిరేకంగా డిక్లరేషన్ ఇవ్వాలంటూ జీవో జారీ చేసింది. డౌరీని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంలో ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 


 


పెళ్లైన నెల రోజుల్లో తాము పని చేస్తున్న హెచ్‌ఓడీకి సదరు ఉద్యోగి తాను కట్నం తీసుకోలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్‌లో భార్య సంతకం ఉండాలి. అంతేనా... ఉద్యోగి తండ్రి, భార్య తండ్రి సంతకాలు కూడా డిక్లరేషన్‌పై చేయించాలి. 


 


ఉమెన్, చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్టమెంట్‌ జారీ చేసిన ఈ సర్క్యులర్‌లో చాలా అంశాలు పొందుపరిచారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, అటామస్‌, ఇతర సంస్థలకు చెందిన ఉద్యోగులను కూడా ఇందులో చేర్చింది ప్రభుత్వం. ఆయా డిపార్టమెంట్‌ హెడ్స్... వరకట్నానికి వ్యతిరేకంగా డిక్లరేషన్ తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి ఏడాది నవంబర్‌ 26న వరకట్న వ్యతిరేక దినంగా జరపాలని కూడా కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు వరకట్నానికి వ్యతిరేకంగా స్కూల్స్, కాలేజీస్‌, ఇతర విద్యాసంస్థల్లో కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. 


 


ఇటీవల కాలంలో కేరళ గవర్నర్‌ అరీఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ కూడా విద్యార్థులకు ఓ సూచన చేశారు. విద్యార్థులు డిగ్రీ పట్టా తీసుకోవడానికి ముందు వరకట్నానికి వ్యతిరేకంగా బాండ్‌ ఇవ్వాలని సూచించారు. 


 


వరక్నటం కారణంగా చాలామంది మహిళలు దాారుణాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపడం లేదు.  ప్రజల్లో మార్పు రానిదే ఏం చేయలేమని గ్రహించిన కేరళ ప్రభుత్వం ఇలాంటి సంచలనం నిర్ణయం తీసుకుంది. 


 


కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. సీఎం విజయన్‌ను దేవుడితో పోలుస్తున్నారు. కట్నాలు ఇవ్వాల్సి వస్తుందని పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే కళ్లు తెరవక ముందే చంపేస్తున్నారు. మరికొందరు పుట్టిన తర్వాత చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. ఫలితంగా బాలికల జనాబా తగ్గిపోతూ వస్తోంది. ఇలాంటి టైంలో కేరళ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ‌్యక్తమవుతోంది.


ASLO READ: మీరాబాయి చాను రజతం... స్వర్ణమయ్యే అవకాశం? ఎలాగంటే... 


ASLO READ: ప్రేయసికి రక్తంతో బొట్టు పెట్టాడు.. కార్గిల్ వీరుడి రియల్ లవ్ స్టోరీ ఇది!