Karnataka Congress: 


బీజేపీ పోస్ట్‌లు..


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై బీజేపీ అభ్యంతరకర ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. ఆ పార్టీపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సిద్దరామయ్యను కించపరిచేలా కొన్ని పోస్టర్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బీజేపీ. సిద్దరామయ్య చీఫ్ మినిస్టర్‌కి బదులుగా సిద్దరామయ్య కలెక్షన్ మాస్టర్ (Siddaramaiah Collection Master)అని పోస్ట్‌లు పెట్టింది. డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌పైనా ఇలాంటి ట్వీట్‌లే చేసింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ భగ్గుమంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో మొత్తం రూ.94 కోట్ల నగదుని స్వాధీనం చేసుకుంది. మరో రూ.8 కోట్ల విలువైన వస్తువుల్నీ సీజ్ చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ సిద్దరామయ్యపై ఈ ట్వీట్‌లు చేసింది. ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా చేస్తోందని కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. ఎవరి ఇంట్లోనే దాడులు జరిగితే వాళ్ల పేర్లు తొలగించి సిద్దరామయ్య పేరుతో మార్ఫిగ్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు పెట్టి కాంగ్రెస్ నేతల్ని అవమానిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు ఫైర్ అయ్యారు. ఐటీ డిపార్ట్‌మెంట్‌ స్పెసిఫిక్‌గా ఓ మంత్రి ఇంట్లో నగదుని సీజ్‌ చేసినట్టు ప్రకటించలేదని, అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు చేయడానికి బీజేపీ ట్విటర్‌ని ఇలా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. గతంలోనూ బీజేపీ ఇలాంటి ట్వీట్‌లే చేసింది. 






సిద్దరామయ్య ఫైర్..


ఈ పోస్ట్‌లపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా స్పందించారు. ఎన్నికల్లో తమను గెలవలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం తప్ప వాళ్లకు వేరే పనేమీ లేదని మండి పడ్డారు. 


"ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. వాళ్ల అవినీతి గురించి తెలుసుకాబట్టే ప్రజలు ఓడించారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేయడానికి వాళ్లకు హక్కు ఎక్కడిది..?"


- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి 


డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ కూడా బీజేపీపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారని, ఈ అక్కసుతోనే ఆ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. బీజేపీ, జేడీఎస్ పొత్తు కారణంగా చాలా మంది కార్యకర్తలు అసహనంగా ఉన్నారని చెప్పారు. 


కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయంగా సంచలనమవుతోంది. మంత్రులందరికీ కొత్త వాహనాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయనుంది. కొత్తగా 33  Toyota Innova Hycross హైబ్రిడ్ SUVలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. 33 మంత్రులకు వీటిని అందజేయనుంది. ఇందుకోసం సుమారుగా రూ.10 కోట్లు కేటాయించింది. అంటే ఒక్కో వెహికిల్‌కి రూ.30 లక్షలు ఖర్చవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇందుకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 29నే అప్రూవ్ చేశారు సిద్దరామయ్య. అదే రోజు ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 


Also Read: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య, రోడ్డు పక్కన చెత్త కవర్‌లో డెడ్‌బాడీ