Jagarnath Mahato Death: చెన్నైలో కన్నుమూసిన జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహతో

Jagarnath Mahato Death: చెన్నైలో కన్నుమూసిన జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహతో

Continues below advertisement

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహతో ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Continues below advertisement

హేమంత్ సోరెన్ ఏమన్నారంటే 'మా టైగర్ జగన్నాథ్ దా ఇక లేరు! ఈ రోజు జార్ఖండ్ ఒక గొప్ప ఉద్యమకారుడిని, పోరాట యోధుడిని, కష్టపడి పనిచేసే మరియు ప్రజాదరణ కలిగిన నాయకుడిని కోల్పోయింది. గౌరవనీయులైన జగన్నాథ్ మహతో చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయిన వారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, ఈ కష్ట సమయాన్ని భరించే శక్తిని ఆ కుటుంబానికి ప్రసాదించాలని ఆకాంక్షించారు.

బడ్జెట్ సమావేశాల క్షీణించిన ఆరోగ్యం

గత కొన్ని నెలలుగా జగన్నాథ్ మహతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్చి 14న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను రాంచీలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ తర్వాత సీఎం సోరెన్ సలహా మేరకు ఆయనను వెంటనే విమానంలో చెన్నైకి తరలించారు. చెన్నైలోని ఓ పెద్ద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందారు. అయితే గురువారం ఉదయం ఆయన కన్నుమూశారు.

బీజేపీ నేతల నివాళి

బీజేపీ నేత బాబూలాల్ మరాండీ కూడా ట్వీట్ చేసి విద్యాశాఖ మంత్రికి నివాళులర్పించారు. 'జార్ఖండ్ మంత్రి జగన్నాథ్ మహతో చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారనే వార్త విని నేను చాలా బాధపడ్డాను. కరోనాను జయిస్తూ యోధుడిలా నిలబడిన జగన్నాథ్ మరణం యావత్ జార్ఖండ్‌కు తీరని శోకాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఆయన శక్తి ఎప్పుడూ మెచ్చుకోదగిందే. భగవంతుడు ఆయన పాదాల చెంత స్థానం ప్రసాదించాలి. హృదయపూర్వక నివాళి. ఓం శాంతి ఓం శాంతి'.

Also Read: కేర‌ళ రైలు దాడి నిందితుడు మ‌హారాష్ట్ర‌లో అరెస్ట్‌

 

Continues below advertisement