J&K: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్- ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

ABP Desam   |  Murali Krishna   |  12 Jun 2022 09:45 PM (IST)

J&K: జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్- ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

J&K: జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి.

ఇదీ జరిగింది

ద్రబ్‌గామ్‌ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య శనివారం కాల్పులు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.s

కాల్పుల్లో మరణించిన వారిని జునైద్‌ షీర్గోజ్రీ, ఫాజిల్‌ నజీర్‌ భట్‌, ఇర్ఫాన్‌ మాలిక్‌గా గుర్తించినట్లు కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్‌కు చెందిన వారని పేర్కొన్నారు.

ఆయుధాలు, మందుగుండు సామగ్రి తదితర వస్తువలను స్వాధీనం చేసుకున్నాం. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయి. మే 13న జవాన్​ రియాజ్​ అహ్మద్​ను హతమార్చడంలో వీరిలో ఒకరి ప్రమేయం ఉంది.                                           - జమ్ముకశ్మీర్ ఐజీపీ

వీరిలో జునైద్‌ అనే ఉగ్రవాది గత నెల 13న అమరుడైన జవాన్‌ రియాజ్‌ అహ్మద్‌ను చంపినవారిలో ఒకడని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, రెండు ఏకే47 రైఫిళ్లు, ఒక పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Also Read: Presidential Polls: దీదీకి ఉద్ధవ్ ఠాక్రే షాక్- ఆ సమావేశానికి మహారాష్ట్ర సీఎం డుమ్మా!

Also Read: Sonia Gandhi Hospitalized: ఆస్పత్రిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Published at: 12 Jun 2022 07:04 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.