Viral News :    ఓ ఎర్ర కారుకు పెద్ద ఎత్తున టపాసులు అంటించి కాల్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత పిచ్చోళ్లుంటారా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆ కారును అలా పేల్చి ఆ  వ్యక్తి అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. కారును టపాసులతో కాల్చిన వ్యక్తి పేరు అమిత్ శర్మ, ఆయన యూట్యూబర్. ఆయనకో యూట్యూబ్ చానల్ ఉంది. ఆ చానల్‌ను ఫాలో అయ్యే వాళ్లంతా ఇలాంటి వెర్రి వీడియోల్ని లైక్ చేసేవాళ్లే. 



 రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన అమిత్‌శర్మ అనే యూట్యూబర్‌ ఓ లక్ష టపాసులతో కారును చక్కగా అలంకరించాడు. ఆ తర్వాత 1.2..3.. అంటూ టపాసులకు నిప్పంటించాడు. ఆ టపాసుల మోతకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. టపాసుల దెబ్బకు ఆ కారు అద్దం పగిలిపోయింది.   కారు ఇంజన్‌ కు మాత్రం ఏం కాలేదు.  టపాసులన్నీ పేలిన తర్వాత. అమిత్‌ మళ్లీ తన కారును డ్రైవ్‌ చేసుకుంటూ ఫ్రెండ్స్‌తో ఎంజారు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.  లక్షల సంఖ్యలో చూస్తున్నారు.  అందరూ ఇతనికేమైనా పిచ్చా అనే కామెంట్లు చేస్తున్నారు.  వాట్సాప్‌లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ అతనికి అలా వీడియోలు చేయడం.. ప్రొఫెషన్


ఇలాంటి క్రేజీ వీడియోలు చేయడంలో అమిత్ శర్మ దిట్ట 


అమిత్ శర్మ.. ఇలాంటి వీడియోలను చాలా కాలంగా చేస్తున్నారు. వీటిని లక్షల మంది చూస్తూ ఉంటారు. ఈ కారణంగా ఆయనకు లక్షల ఆదాయం కూడా వస్తుంది. ఇలాంటి క్రేజీ ఎక్రస్ వై జడ్ వీడియో లను చేసుకోవడమే తన ప్రొఫెషన్‌గా మార్చుకున్నాడు.  ఇతని పిచ్చి తరహా వీడియోలు చూడటానికి లక్షల మంది రెడీగా ఉంటారు. ఎలాంటి వీడియో అప్ లోడ్ చేసినా ఇట్టే చూసేస్తారు. అందుకే అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. 


యూట్యూబ్ చానల్‌తో లక్షల్లో సంపాదిస్తున్న అమిత్ శర్మ 


చూడటానికి సాదాసీదాగా కనిపిస్తారు కానీ... అమిత్ శర్మకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియా స్నేహితులతో సమావేశం ఏర్పాటు చేస్తే వేల మంది వస్తారు.