ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శుక్రవారం ట్విట్టర్ అకౌంట్‌లో కొన్ని ఫోటుు షేర్ చేసింది. రెండు రోజుల క్రితం చంద్రుడిపై ల్యాండ్ అయిన  విక్రమ్ ల్యాండర్ చిత్రాలు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో విఫలమైందని అనుకున్న చంద్రయాన్ -2 ఆర్బిటర్ ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఫొటోలు పంపించింది చంద్రయాన్ -2 ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరానే. 


చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు అప్పట్లోనే హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)ను అమర్చారు. అందుకే చంద్రయాన్-3లో అలాంటి సెటప్‌ పెట్టలేదు. దీని కోసం చంద్రయాన్-2 ఆర్బిటర్‌పైనే ఆధారపడి ఉంది. ఆ నాడు పంపిన కెమెరానే ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌లకు అమర్చిన  కెమెరాల్లో అత్యుత్తమ రిజల్యూషన్‌ను కలిగి ఉందని ఇస్రో రాసింది.






ఇస్రో ఈ పోస్టు చేసిన కాసేపటికే తన అధికారిక ట్విట్‌ ఖాతా నుంచి డిలీట్ చేసింది. అయితే చంద్రయాన్ -3 కోసం క్రియేట్ చేసిన అకౌంట్‌లో మాత్రం పోస్టును అలానే ఉంచింది.