అండమాన్ నికోబార్ దీవులను స్వాతంత్య్రానికి సంబంధించిన యాత్రా స్థలాలుగా భావించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యువత తమ జీవితంలో కనీసం ఒకసారి అండమాన్ నికోబార్ సందర్శించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిలో పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై, ఆయన జీవితంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మన దేశ వ్యాప్తంగా ఆజాదీ క అమ్రుత్ మహోత్సవాలతో పాటు నేతాజీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. కానీ నేతాజీ జీవితాన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుందన్నారు. ఆయనకు తీరని అన్యాయం జరిగినట్లు తాను భావిస్తానని పేర్కొన్నారు. ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని.. చరిత్రలో ఆయనకు అలాంటి స్థానం ఇవ్వకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
Also Read: తండ్రి తన కొడుక్కి ఎంత ఆస్తిని బహుమతిగా ఇవ్వచ్చు? చట్టం ఏం చెబుతోంది?
చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకుల కీర్తి ప్రతిష్టలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్యాయానికి గురైన గొప్ప నేతలు, మహానుభావులకు చరిత్రలో సరైన స్థానం కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. తమ జీవితాలను త్యాగం చేసిన వ్యక్తులు చరిత్రలో తగిన స్థానం, గౌరవం పొందాలని తాము భావిస్తున్నామని... అందులో భాగంగానే అండమాన్ నికోబార్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టామని అమిత్ షా వెల్లడించారు.