Poonch Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. రెండు భారత సైనికుల వాహనాలపై శనివారం నాడు ఉగ్రవాదులు దాడి చేశారు.  అందులో ఒకటి భారత వైమానిక దళానికి (IAF) చెందింది. ఈ ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ ప్రాంతంలోని సనాయి టాప్‌కు ఆర్మీ వాహనాలు వెళ్తుండగా సాయంత్రం Shahsitar సమీపంలో ఉగ్రవాడులు ఒక్కసారిగా కాల్పుల జరిపారు. ఈ దాడిలో గాయపడిన జవాన్లను వైద్య చికిత్స సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.






ఉగ్రదాడి ఘటనతో సైన్యంతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేసిన Shahsitar ప్రాంతానికి భారీ సంఖ్యలో ఆర్మీ జవాన్లు, పోలీసులు చేరుకుని పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మిలిటెంట్ల కోసం అణువణువు గాలిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం ఉదంపూర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.


అనంతనాగ్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం
జమ్మూకశ్మీర్‌ లోని అనంత్‌ నాగ్‌లోని వెరినాగ్ ప్రాంతంలో ఆర్మీకి చెందిన ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. బటాగుండ్ వెరినాగ్ వద్ద 19 ఆర్‌ఆర్‌కు చెందిన ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. గాయపడిన ఆర్మీ జవాన్లను చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.