Indian Railway Super App: ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్ రైల్వే (Indian Railways) ఒకటి నిత్యం కోట్లా మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అంతే కాదు ప్రతి రోజు దేశంలోని నలుమూలకు సరుకు రవాణా చేస్తుంది. ఇండియన్ రైల్వేకు సంబంధించి అనేక యాప్‌ (Apps)లు ఉన్నాయి. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ అవసరం లేకుండా రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే నుంచి ఓ సూపర్ గుడ్ న్యూస్. త్వరలో సూపర్ యాప్ (Super App) తెచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఓ సూపర్‌ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇది  అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్​ బుకింగ్, ఫుడ్ డెలివరీ, పీఎన్​ఆర్​ స్టేటస్​, ట్రైన్​ రన్నింగ్ స్టేటస్​ సహా, అన్ని రకాల రైల్వే సేవలు ఓకే చోట లభిస్తాయి.  


ఒక్కో సేవకు ఒక్కో యాప్
ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం ' ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌' యాప్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఇదే కాకుండా యూటీఎస్‌, రైల్‌ మదద్ యాప్‌​లను కూడా వేలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  సీట్ కన్ఫర్మేషన్ కోసం ఉపయోగించే పీఎన్​ఆర్​ స్టేటస్​, ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవడానికి ఇతర యాపు​లు ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించాలంటే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ సమస్యలు అన్ని పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సూపర్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత, వీటితో పని ఉండదు. ఐఆర్‌సీటీసీ అందించే ఫ్లైట్​ టికెట్‌ బుకింగ్​, ఫుడ్‌ డెలివరీ లాంటి సేవలు కూడా ఇందులోనే లభించనున్నాయి.  


అన్ని సేవలు ఒకే చోట
ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం 'రైల్‌ కనెక్ట్‌' యాప్‌ అందుబాటులో ఉంది. లక్షలాది మంది ఈ యాప్​ను డౌన్‌లోడ్​ చేసుకున్నారు. ఇది కాకుండా యూటీఎస్‌, రైల్‌ మదద్ యాప్​లను కూడా వేలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే సూపర్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత, వీటితో పని ఉండదు. అంతేకాదు, ఐఆర్‌సీటీసీ అందించే ఫ్లైట్​ టికెట్‌ బుకింగ్​, ఫుడ్‌ డెలివరీ లాంటి సేవలు కూడా ఇందులోనే లభించనున్నాయి. 


రూ.90 కోట్లు ఖర్చు
రైల్వే సేవలు అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఇండియన్​ రైల్వే ఓ సూపర్​ యాప్‌​ను రూపొందించే పనిలో ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) ఈ సూపర్​ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా అన్ని రకాల సేవలను ఒకే చోట అందించవచ్చు. ఇందుకోసం రైల్వే శాఖ రూ.90 కోట్లు వరకు ఖర్చు చేస్తోంది. ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణికులకు ఇప్పుడు ఉన్న వివిధ ట్రైన్ సర్వీస్​ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే ఇబ్బంది తప్పుతుందని, ఇకపై రైల్వేకు చెందిన అన్ని సర్వీసులు ఒకే చోట లభిస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. యాప్ రూపకల్పన కోసం రైల్వే శాఖ యూజర్ల ఫీడ్‌​బ్యాక్ తీసుకుంటోంది. అయితే ఈ సూపర్ యాప్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు.