Mamata Banerjee Dig At PM Modi:
ఫైనల్ మ్యాచ్‌పై దీదీ వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match) గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో ఇండియా అన్ని మ్యాచ్‌లు గెలిచిందని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా హాజరైన ఫైనల్ మ్యాచ్ మాత్రం ఓడిపోయిందని అన్నారు. వాళ్లు రావడం వల్లే భారత్ కప్ గెలుచుకోలేకపోయిందని విమర్శించారు. మోదీ, అమిత్‌షా లాంటి పాపాత్ములు రావడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో ఈ కామెంట్స్ చేశారు. గుజరాత్‌లో కాకుండా కోల్‌కత్తాలోనే, ముంబయిలోనో ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండేదని అన్నారు. కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేశారని అన్నారు.
"కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనో లేదంటే ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే భారత్ కచ్చితంగా కప్ గెలిచేది. వాళ్లు కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని చూశారు. కానీ మన ప్లేయర్స్ అందుకు ఒప్పుకోలేదు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకున్నారు. క్రీడలకు సంబంధించిన అన్ని ఫెడరేషన్స్‌పైనా రాజకీయ ఆధిపత్యం పెరిగిపోతోంది. క్రికెట్‌లోనే కాదు కబడ్డీలోనూ కాషాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాషాయ రంగు త్యాగానికి నిదర్శనం. కానీ బీజేపీకి ఆ స్థాయి లేదు"
- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి
కాషాయాన్ని రుద్దేస్తున్నారు..
అంతకు ముందు కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పలు కీలక సంస్థలపై కాషాయాన్ని రుద్దేందుకు కుట్ర జరుగుతోందని మండి పడ్డారు. కచ్చితంగా మన ఇండియన్ ప్లేయర్స్ కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్ అవుతారని అన్నారు.
"ఇప్పుడు బీజేపీ ప్రతిదాన్నీ కాషాయంతో నింపేయాలని చూస్తోంది. ఇండియన్ ప్లేయర్స్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వాళ్లు కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్ అవుతారు. కానీ బీజేపీ మాత్రం వాళ్ల జెర్సీలను కూడా కాషాయ రంగులోకి మార్చేయాలని చూస్తోంది. బ్లూ జెర్సీలను కాషాయంగా మార్చేయాలని చూస్తున్నారు"
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ODI World Cup 2023 ఫైనల్ మ్యాచ్‌ని గుజరాత్‌లో కాకుండా లఖ్‌నవూలో పెట్టుంటే కచ్చితంగా ఇండియా గెలిచేదని అన్నారు. వరల్డ్ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్‌లో మాత్రం చతికిలబడిపోయింది. ఈ మ్యాచ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
"World Cup 2023 final మ్యాచ్‌ని గుజరాత్‌లో పెట్టారు. అలా కాకుండా లఖ్‌నవూలో పెట్టి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచేది. ఇండియన్ టీమ్‌కి చాలా మంది ఆశీర్వాదాలు లభించేవి. ఆ విష్ణుమూర్తితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆశీర్వాదాలతో ఇండియా తప్పకుండా గెలిచి ఉండేది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌లో ఏదో లోపం ఉన్నట్టుగా తెలుస్తోంది"
- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్
Also Read: J&K's Rajouri Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం