Jammu Kashmir Rajouri Encounter: 



లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హతం..


జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. లష్కరే తోయిబాకి చెందిన కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కలకోట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు అమరులయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో సైనికుడు ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎన్‌కౌంటర్‌కి బదులు తీర్చుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రస్థావరాలపై కాల్పులు జరిపాయి. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరి పేరు కరీగా వెల్లడించారు. లష్కరే తోయిబాలో (Lashkar-e-Taiba) హైర్యాంక్‌ టెర్రరిస్ట్‌లలో ఒకరైన కరీని మట్టుబెట్టేందుకు చాలా రోజులుగా గాలిస్తోంది. రాజౌరిలో ఉగ్రకార్యకలాపాలను లీడ్ చేసేందుకు లష్కరే తోయిబా కరీని పంపింది. IEDలు పేల్చడంలో ఎక్స్‌పర్ట్. భద్రతా బలగాల కళ్లు గప్పి తిరుగుతూ గుహల్లో దాక్కుంటున్నాడు కరీ. అక్కడి నుంచి దాడులకు ప్లాన్ చేస్తున్నాడు. రౌజారి-పూంఛ్‌ ప్రాంతంలో దాదాపు ఏడాదిగా నక్కి ఉంటున్నాడు. డంగ్రీ, కందీ ప్రాంతాల్లో భద్రతా బలగాలపై దాడులను లీడ్ చేశాడు. నవంబర్ 22వ తేదీన ఉదయమే...స్పెషల్ ఆపరేషన్ లాంఛ్ చేశారు. 






సీనియర్ కమాండర్ల ఆపరేషన్..


ఫుడ్ విషయంలో ఓ స్థానికుడిని ఉగ్రవాదులు బెదిరించాడు. అందుకు ఒప్పకోకపోవడం వల్ల ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఇదీ స్థానికంగా సంచలనమైంది. స్థానికుల సమాచారం మేరకు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. దట్టమైన అడవులు, కొండలు ఉండడం వల్ల భద్రతా బలగాల నుంచి సులువుగా తప్పించుకున్నారు ఉగ్రవాదులు. దాక్కుని కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మొహరించారు. సీనియర్ ఆర్మీ కమాండర్లు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి.*T&C Apply


Also Read: Regulation on Deepfakes: డీప్‌ఫేక్‌ వీడియోల కట్టడికి కొత్త చట్టం! కీలక ప్రకటన చేసిన కేంద్రం