Corona Cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 13,313 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు. తాజాగా 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.19 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81గా నమోదైంది.
- మొత్తం కరోనా కేసులు: 4,33,44,958
- మొత్తం మరణాలు: 5,24,941
- యాక్టివ్ కేసులు: 83,990
- మొత్తం రికవరీలు: 4,27,36,027
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 14,91,941 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది. మరో 6,56,410 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.
Also Read: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీస్ కాదు కలెక్షన్ కింగ్, ఆరు గంటల్లో రూ. 6లక్షలు వసూలు
Gali Janardhan Reddy : నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతా, గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు