Corona Cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది మృతి చెందారు. తాజాగా 9,486 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


రికవరీ రేటు 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.22 శాతం ఉన్నాయి. 







  • మొత్తం కరోనా కేసులు: 43,418,839

  • మొత్తం మరణాలు: 5,25,047

  • యాక్టివ్​ కేసులు: 96,700

  • మొత్తం రికవరీలు: 4,27,97,092


వ్యాక్సినేషన్







దేశంలో తాజాగా 19,21,811 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరో 4,73,717 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు


Also Read: AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం