India's Obesity Guidelines : ఊబకాయానికి కొత్త నిర్వచనం.. బాడీ మాస్ ఇండెక్స్ మాత్రమే కీలకం కాదట - భారతీయులకు బిగ్‌ అలర్ట్

India's Obesity Guidelines : బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగానే వ్యక్తికి ఊబకాయం ఉన్నట్టు నిర్థారించకూడదని నిపుణులు చెబుతున్నారు.

Continues below advertisement

India's Obesity Guidelines : దేశంలో ఇప్పుడు ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు లేని పోని వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. అయితే ఊబకాయం లేదా స్థూలకాయాన్ని చాలా మంది బాడీ మాస్ ఇండెక్స్ నంబర్ ఆధారంగా లెక్కిస్తూ ఉంటారు. దీని ద్వారానే తాము బరువు మెయింటెయిన్ చేస్తున్నామా? పెరుగుతున్నామా?  తగ్గుతున్నామా అనే నిర్ధారణకు వస్తూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ కాదని చెబుతున్న ఆరోగ్య నిపుణులు. కేవలం బీఎంఐ ఆధారంగానే ఊబకాయం ఉందని నిర్థారణ రావొచ్చని చెబుతున్నారు. బీఎంఐని కిలోగ్రాములలో ఒక వ్యక్తి బరువు ఆధారంగా శరీర కొవ్వు కొలతగా నిర్వచిస్తారు. 30 కంటే ఎక్కువ బీఎంఐ ఉన్న వ్యక్తిని సాధారణంగా ఊబకాయం ఉన్న వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే కొన్ని సార్లు శరీరంలో అధిక కొవ్వు ఉన్నప్పటికీ వారి బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉండదు. ఈ కారణంగా నిపుణులు స్థూలకాయానికి మరో కొత్త నిర్వచనాన్ని అందించారు. 

Continues below advertisement

చాలా మంది స్మార్ట్ గా బతుకుతున్నామని అనుకుంటారు. కూర్చున్న దగ్గర్నుంచి లేవకుండా ఈజీలు పనులు కట్టబేస్తుంటారు. కానీ ఇది దీర్ఘకాలంలో అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని వారికి కాస్త లేటుగా అర్థమవుతుంది. ఫోన్లు, ల్యాప్ టాప్ లకే అతుక్కుపోయి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కు అలవాటు పడిపోయి.. అధిక బరువును వదిలించుకోలేక జిమ్, యోగా వంటి వర్కవుట్స్ చేయడం రోజూ ఎంతో మందిని చూస్తూనే ఉండడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే వీరు ఊబకాయాన్ని లెక్కగట్టేందుకు సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. కానీ కేవలం ఈ నంబర్ తోనే స్థూలకాయాన్ని అంచనా వేయొద్దని నేషనల్ డయాబెటిస్ ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ (N-DOC), ఫోర్టిస్ సి-డిఓసి హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు, సర్జన్లు, ఫిజియోథెరపిస్టులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఈ కొత్త నిర్వచనాన్ని విడుదల చేసింది.

"ఈ అధ్యయనం భారతీయులకు ఊబకాయం, సంబంధిత వ్యాధులను ఎదుర్కోవటానికి ఒక ప్రత్యేకమైన, లక్ష్య విధానాన్ని అందిస్తుంది" అని ఎయిమ్స్ లోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ నావల్ విక్రమ్ అన్నారు. శరీరంలోని అధిక కొవ్వు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నప్పటికీ, ఊబకాయం తరచుగా ఒక వ్యాధి కంటే ఇతర వ్యాధులకు హెచ్చరిక చిహ్నంగా కనిపిస్తుంది. దీంతో ఈ ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఊబకాయానికి కొత్త నిర్వచనం

లాన్సెట్ పరిశోధకులు క్లినికల్ స్థూలకాయాన్ని అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది ఇతర వైద్య నిపుణులలో దీర్ఘకాలిక వ్యాధి భావనతో సమానంగా, అవయవాలు, కణజాలాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే స్థితి. ఊబకాయం శరీర కొవ్వు ద్వారా నిర్వచించినప్పటికీ, దానిని ఖచ్చితంగా కొలవడానికి బయోఎలెక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా DEXA స్కాన్‌ల వంటి ప్రత్యేక యంత్రాలు అవసరమవుతాయి. వాస్తవానికి ఇవి ఖరీదైనవి. క్లినిక్‌లలో సాధారణంగా అందుబాటులో ఉండవు. ఊబకాయం ఉన్నవారి శరీరంలో కొవ్వులు కరగకుండా ఉండిపోతాయి. అయితే వారి శరీరంలో కొవ్వు ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇతర ప్రాంతాలలో నిల్వ ఉన్న కొవ్వుతో పోలిస్తే పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు చాలా ప్రమాదకరం. ఇది ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

కొత్త మార్గదర్శకాలు, నిర్వచనాన్ని ఎందుకు ప్రతిపాదించారంటే..

భారతీయ వైద్యులు, పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం, అనేక కారణాల వల్ల ఊబకాయం కోసం కొత్త నిర్వచనం, మార్గదర్శకాలు అవసరరం అని చెప్పవచ్చు. అందులో..

కాలం చెల్లిన BMI ప్రమాణాలు: పాత 2009 మార్గదర్శకాలు ఊబకాయాన్ని నిర్ధారించడానికి BMI (బరువు నుండి ఎత్తు నిష్పత్తి)పై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులకు BMI మాత్రమే సరిపోదని ఇప్పుడు పరిశోధనలు చెబుతున్నాయి.

పొత్తికడుపు ఊబకాయం: భారతీయులలో పొట్ట కొవ్వు, వాపు వంటి ప్రారంభ ఆరోగ్య సమస్యల మధ్య బలమైన సంబంధాన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రమాదాలను స్పష్టం చేయడం: కొత్త మార్గదర్శకాలు ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఊబకాయం నుండి హానికరం కాని ఊబకాయాన్ని వేరు చేస్తాయి.

కొత్త మార్గదర్శకాలలో కీలక మార్పులు

బెల్లీ ఫ్యాట్‌పై దృష్టి పెట్టండి: ఇన్సులిన్ నిరోధకత, ఇతర పరిస్థితులకు సంబంధం కారణంగా స్థూలకాయాన్ని నిర్ధారించడంలో పొత్తి కడుపులో కొవ్వు ఉండడం ఇప్పుడు కీలక అంశంగా మారింది.

ఆరోగ్య సమస్యలు : ఈ నిర్వచనంలో మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఊబకాయానికి సంబంధిత సమస్యలు ఉన్నాయి.

2 రకాలుగా స్థూలకాయం

స్టేజ్ 1 స్థూలకాయం: అవయవ పనితీరు లేదా రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m²). స్థూలకాయంలో ఈ దశ, ప్రస్తుతం ఎటువంటి రోగనిర్ధారణ సమస్యలను కలిగించదు.  

స్టేజ్ 2 స్థూలకాయం: 23 కిలోల/మీ2 కంటే ఎక్కువ BMI, ఉదర కొవ్వు, అదనపు నడుము చుట్టుకొలత (WC) లేదా నడుము నుండి ఎత్తు నిష్పత్తి (W-HtR) లాంటివి ఈ స్టేజ్ 2 స్థూలకాయంలో అధునాతన స్థితిని సూచిస్తాయి. ఇది రీరక, అవయవ పనితీరులపై ప్రభావం చూపుతుంది. యాంత్రిక పరిస్థితులు (అధిక బరువు కారణంగా మోకాలి కీళ్ళనొప్పులు వంటివి) లేదా ఊబకాయంతో సంబంధం ఉన్న వ్యాధుల ఉనికి (టైప్ 2 మధుమేహం వంటివి) ఉన్న వారి సమస్యలను ఇది మరింత పెంచుతుంది.

Also Read : EMS ట్రీట్​మెంట్​తో కొవ్వు తగ్గుతుందా? వ్యాయామం, డైట్ చేయకపోయినా ఇంచ్​ లాస్ అవ్వడంలో నిజమెంతంటే

Continues below advertisement