Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్ - అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రాలివే!

Lok Sabha election 2024 Phase 4 polling Live: దేశ వ్యాప్తంగా ఇదివరకే 3 విడతల పోలింగ్ జరిగింది. నేడు 4వ విడతలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ABP Desam Last Updated: 13 May 2024 06:29 PM

Background

Lok Sabha election 2024 Phase 4 polling live updates- న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇదివరకే 3 విడతల పోలింగ్ జరిగింది. లోక్ సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ సోమవారం (మే 13న) 96 పార్లమెంట్...More

దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్ - అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రాలివే!

దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 62.31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా పశ్చిమబెంగాల్ లో 75.66 శాతం నమోదు కాగా.. ఏపీ 68 శాతం, తెలంగాణ 61.16, మధ్యప్రదేశ్ 68.01, ఒడిశా 62.96, మహారాష్ట్ర , బీహార్ 56.14, యూపీ 56.35, జమ్ముకశ్మీర్ - 35.75, ఝార్ఖండ్ - 63.14 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.