India On Trump Tariffs: బ్రేకుల్లేని బండిలో తనకు పోటీ వచ్చే దేశాలపై టారిఫ్తో దండయాత్ర చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ఆట కట్టించేందుకు భారత్ సహా కీలక దేశాలు స్కెచ్ వేస్తున్నట్టు అర్థమవుతోంది. దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బ్రెజిల్తో కూడా చర్చిసిస్తున్నారు. మిత్రుడిగా భావించిన ట్రంప్ వెన్నుపోటు పొడిచారని భారత్ భావిస్తోంది. రష్యాతో స్నేహంగా ఉన్నారనే కారణంతో 50 శాతం టారిఫ్విధించడంపై ప్రతివ్యూహం రచిస్తున్నారు.

అమెరికాకు చావు దెబ్బ కొట్టాలనే ఆలోచనతో గతానికి భిన్నంగా ఆడుగులేస్తున్నారు మోదీ. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో మాట్లాడుతున్నారు. ఆగస్టు నెలలో 7 సంవత్సరాల తర్వాత చైనాకు మొదటిసారిగా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు చర్యలు అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక స్టెప్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి టియాంజిన్‌కు వెళతారు, అక్కడ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు.

లూలాతో చర్చ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా భారతదేశం-యుఎస్ వాణిజ్య యుద్ధం, అమెరికా సుంకాల పరిస్థితిపై చర్చిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్బ్రెజిల్పై కూడా యాభై శాతం టారిఫ్ వేశారు. దీనిపై దేశం కూడా రగిలిపోతోంది.

చైనా పర్యటన ,SCO సమావేశం

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రధాని మోదీ ఆగస్టు చివరిలో చైనాను సందర్శిస్తారు. చివరిసారిగా 2018లో చైనా వెళ్లిన ప్రధానమంత్రి మోదీ ఏడేళ్ల తర్వాత మరోసారి డ్రాగన్ కంట్రీ సందర్శిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో టియాంజిన్‌లో పాల్గొంటారు, అక్కడ షీ జిన్‌పింగ్‌ను కలుసుకుంటారు. ఈ సమావేశం ఆగస్టు 31,సెప్టెంబర్ 1న జరగనుంది.

అమెరికా సుంకాల మధ్య ఈ దౌత్యం ముఖ్యం

రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ట్రంప్ సర్కారు ఇండియాపై 50 శాతం టారిఫ్ను విధించింది. మొదట 25 శాతమే అని చెప్పింది. రెండు రోజుల క్రితం మళ్లీ దాన్ని డబుల్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడం ప్రపంచానికి ప్రమాదమని ట్రంప్ అభివర్ణిస్తున్నారు. అందుకే చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ట్రంప్ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది అన్యాయమైన నిర్ణయమని పేర్కొంది. అయినా సరే భారత్లోని రైతుల ప్రయోజానులు, ప్రజల సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. టైంలోనే భారతదేశకు బ్రెజిల్, చైనా, రష్యా వంటి బ్రిక్స్ దేశాలతో సంబంధాలు మరింత ముఖ్యమైనవిగా మారాయి.

ఇతర దౌత్య కార్యకలాపాలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో ఉన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా రష్యాను సందర్శించాలని ముందుగా నిర్ణయించారు. ఈ సంవత్సరం చివరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా భారతదేశానికి ఆహ్వానించడానికి భారత్ సిద్ధమవుతోంది. ట్రంప్ చర్యల వల్ల భారత్, రష్యా మరింత దగ్గరవుతున్నాయి.