India@2047 ABP Network's Summit: ఇంకో 22 ఏళ్లకి... నవ్య భారతావని స్వతంత్ర దేశంగా శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 1947లో స్వాతంత్రం పొంది వజ్రోత్సవాలు కూడా జరుపుకున్న భారతావని అనేక రంగాల్లో ప్రపంచ స్థాయిలో నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా... విద్య, విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో మార్గదర్శిగా.. ప్రబల సైనిక శక్తిగా..భవిష్యత్ ఆర్థిక శక్తిగా భారత్‌ను ప్రపంచం కీర్తిస్తోంది. ఈ డెబ్బై ఏడేళ్ల కాలంలో ప్రజ్వలమైన శక్తిగా భారత్ నిలిచింది. అయితే స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే అత్యున్నత శక్తిగా భారత్ ఎదగాలనే సంకల్పాన్ని ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్నారు. శత వసంతాల నాటికి వికసిత భారతాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం అన్నిరంగాలకూ లక్ష్యాలను విధించారు. ఆ దిశగా దేశం పయనిస్తోంది. అందులో భాగంగానే.. మీడియా రంగంలో వందేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏబీపీ గ్రూప్.. శత వసంత భారతానికి స్వాగతం పలుకుతోంది. ఏబీపీ నెట్‌వర్క్ మే 6వ తేదీన ఢిల్లీలోని భారత మండపంలో India@2047 కాంక్లేవ్ ను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసాన్ని అందించనున్నారు.
INDIA@2047 ఏంటంటే..?భారత్... ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటైన ఈ దేశం ఇప్పుడు చరిత్ర గమనంలో ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. సాంప్రదాయ, వారసత్వ విజ్ఞానంతో.. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ.. 2047 నాటికి శత వసంతాల స్వతంత్ర భారతావని వికసిత భారత్‌గా ఎదిగేందకు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళుతోంది.
ఈ స్ఫూర్తితోనే ABP Network India @ 2047 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ముఖ్యులు పాల్గొనే ఈ లీడర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్రమోదీ లీడ్ చేయనున్నారు. దేశ, విదేశాలకు చెందిన విజనరీలు, పారిశ్రామిక దిగ్గజాలు, భవిష్యత్ నిర్దేశకులు ఈ సమ్మిట్‌లో భారత భవిష్యత్ మార్గాన్ని ఆవిష్కరించనున్నారు.
India @ 2047 అనేక ఆలోచనల సమాహారం, కొత్త వ్యూహాలకు కార్యస్థానం, ఆధునిక భారతానికి పునాదులైన యువతకు మార్గనిర్దేశాన్ని అందించే కీలక సందేశం. ఇప్పటికే ప్రపంచ స్థాయి లక్ష్యాలతో ఉన్న 2047 రోడ్‌మ్యాప్‌పై మరింత స్పష్టంగా ఈ కాంక్లేవ్ చర్చించనుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే: India 2047 అనేది దేశీయంగా గ్లోబల్ స్థాయిలో భారత భవిష్యత్ స్థానాన్ని నిర్దేశించడం కోసం ఒక స్పష్టమైన విజన్‌తో చర్చించే వేదిక.
ఇది సాధారణంగా జరిగే రాజకీయ, పారిశ్రామిక సమ్మేళనం కాదు. అంతే కాదు.. ఇది కేవలం భారత లీడర్లకు మాత్రమే పరిమితం అయింది కూడా కాదు.
ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసం
భారత మండపంలో మే 6 వ తేదీన ఉదయం ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసంతో ముగుస్తుంది. My Vision @2047 | India Full Speed Ahead అనే థీమ్‌పై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఆయన కాకుండా రచయత, హిస్టారియన్ విక్రమ్ సంపత్, అంతర్జాతీయ టీవీ హోస్ట్ Bear Grylls, యాక్టర్ Aamir Khan, Amul MD జయేన్ మెహతా, రేమాండ్స్ ఎండీ గౌతమ్ సింఘానియా, క్రికెటర్లు మిథాలీరాజ్, గౌతం గంభీర్ ఇంకా పలువురు వివిధ సెషన్లలో పాల్గొంటారు.
ఈ సమ్మేళనం ఎందుకంటే…India 2047 కేవలం ప్రసంగాలకు పరిమితమయ్యే వేదిక కాదు. దేశాన్ని భవిష్యత్ గమనం వైపు నడిపించే ఓ చోదక శక్తిగా ఉపయోగపడనుందని ABP NETWORK విశ్వసిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను అత్యున్నత స్థాయిలో నిలపాలన్న లక్ష్యానికి ఓ స్పష్టమైన రూపాన్ని అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది.