INDI bloc Meeting in Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఇండి కూటమి నేతలు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండి కూటమిలోని పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, కూటమిలోని పార్టీలు అన్నీ కలిసి కట్టుగా ఎన్డీఏపై పోరాడారని అన్నారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమి అందర్నీ ఆశ్చర్యపర్చేలా ఎన్నికల ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. కూటమిలో పార్టీలు అన్ని కలిపి 234 సీట్లు గెలిచాయి. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్‌ను కూడా కలుపుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని.. ఇండి కూటమి భావిస్తోంది. కానీ, వారు ఇద్దరూ ఎన్డీఏతో కలిసి సాగుతామని ఎన్డీఏ సమావేశంలో ప్రకటించారు.
ఇండి కూటమి సమావేశంలో పాల్గొన్న నేతలు1. మల్లికార్జున్ ఖర్గే - కాంగ్రెస్2. సోనియా గాంధీ - కాంగ్రెస్3. రాహుల్ గాంధీ - కాంగ్రెస్4. కె.సి. వేణుగోపాల్ - కాంగ్రెస్5. శరద్ పవార్ - NCP6. సుప్రియా సూలే - ఎన్సీపీ7. ఎం.కె. స్టాలిన్ - డిఎంకె8. టి.ఆర్. బాలు - డిఎంకె9. అఖిలేష్ యాదవ్ - SP10. రాంగోపాల్ యాదవ్ - SP11. ప్రియాంక గాంధీ వాద్రా - కాంగ్రెస్12. అభిషేక్ బెనర్జీ - AITC13. అరవింద్ సావంత్ - SS(UBT)14. తేజస్వి యాదవ్ - RJD15. సంజయ్ యాదవ్ - RJD16. సీతారాం ఏచూరి - సిపిఐ(ఎం)17. సంజయ్ రౌత్ - SS(UBT)18. డి.రాజా - సి.పి.ఐ19. చంపై సోరెన్ - JMM20. కల్పనా సోరెన్ - JMM21. సంజయ్ సింగ్ - AAP22. రాఘవ్ చద్దా - AAP23. దీపాంకర్ భట్టాచార్య - CPI(ML)24. ఒమర్ అబ్దుల్లా - JKNC25. సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ - IUML26. P. K. కున్హాలికుట్టి - IUML27. జోస్ కె. మణి - కెసి(ఎం)28. తిరు తోల్. తిరుమావళవన్ - VCK29. ఎన్.కె. ప్రేమచంద్రన్ - RSP30. డా. ఎం.హెచ్. జవహిరుల్లా - (MMK)31. జి. దేవరాజన్ - AIFB32. తిరు ఇ.ఆర్. ఈశ్వరన్ - (KMDK)33. డి. రవికుమార్ - VCK