Independence Day 2023 LIVE: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని - దేశం అవకాశాల గని- యువతకు వినియోగించుకోవాలని సూచన

Independence Day 2023 LIVE Updates: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశం జరుపుకుంటోంది. చారిత్రాత్మక ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నేతృత్వం వహిస్తారు.

ABP Desam Last Updated: 15 Aug 2023 09:09 AM
విజయవాడలో జాతీయ జెండాను ఎగరేసిన సీఎం జగన్

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 

ఇది న్యూ ఇండియా దూసుకెళ్తుంది: మోదీ 

ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'భారత నూతన పార్లమెంట్ ఇటీవలే నిర్మించాం. ఇది న్యూ ఇండియా. యావత్ ప్రపంచం ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఆ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.

వచ్చే నెలలో విశ్వకర్మ యోజన ప్రారంభం


సంప్రదాయ నైపుణ్యాలున్న వారి కోసం వచ్చే నెలలో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు. విశ్వకర్మ పథకంలో రూ.15,70 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. 

దేశ ప్రజల ముందు గత పదేళ్ల చరిత్ర ఉంచుతున్నాం: మోదీ

2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నాం. ఈ రోజు మనం 5వ స్థానానికి చేరుకున్నాం. గతంలో ఇలా జరగలేదు. అప్పుడు అవినీతి దేశాన్ని పట్టిపీడించింది. 10 సంవత్సరాల లెక్కలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నాను. గతంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారు. నేడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ఐదున్నరేళ్లలో 5.13 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.

'మేం తీసుకునే నిర్ణయాలు స్వర్ణ చరిత్రకు నాంది పలుకుతాయి'

ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'నేను 1000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే దేశం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను చూస్తున్నాను. మనం జీవిస్తున్న యుగంలో ఏం చేస్తాం, వేసే అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఒకదాని తర్వాత ఒకటి సువర్ణ చరిత్రకు నాంది పలుకుతాయి.

దేశం అవకాశాల గని- యువతకు ఇదే మంచి ఛాన్స్ : ప్రధాని 

ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని యువతకు లభించినంత సౌలభ్యం మరెవరికీ దక్కడం లేదన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ప్రభావితమవుతుందని.. జనాభా, విస్తీర్ణం పరంగా కొన్ని నగరాలు, పట్టణాలు చిన్నవే కావచ్చని కానీ అక్కడ ప్రజల సామర్థ్యం దేనికీ తీసిపోదన్నారు. దేశంలో అవకాశాలకు కొదవలేదన్న మోదీ... ఎన్ని అవకాశాలు కావాలన్నా ఇవ్వగల సత్తా ఈ దేశానికి ఉందని అభిప్రాయపడ్డారు. 

'ప్రకృతి వైపరీత్యాలతో అనేక ప్రాంతాల్లో ఊహించని సంక్షోభం'

ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈసారి ప్రకృతి వైపరీత్యం దేశంలోని పలు ప్రాంతాల్లో ఊహించని సంక్షోభాన్ని సృష్టించిందన్నారు. దీన్ని ఎదుర్కొన్న ప్రజలకు ప్రధాని సానుభూతి తెలియజేశారు. ఆ సంక్షోభాల ప్రభావం లేకుండా రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వం కలిసి వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగాలని ఆకాంక్షించారు. అలా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

'ప్రకృతి వైపరీత్యాలతో అనేక ప్రాంతాల్లో ఊహించని సంక్షోభం'

ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈసారి ప్రకృతి వైపరీత్యం దేశంలోని పలు ప్రాంతాల్లో ఊహించని సంక్షోభాన్ని సృష్టించిందన్నారు. దీన్ని ఎదుర్కొన్న ప్రజలకు ప్రధాని సానుభూతి తెలియజేశారు. ఆ సంక్షోభాల ప్రభావం లేకుండా రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వం కలిసి వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగాలని ఆకాంక్షించారు. అలా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

త్వరలోనే మణిపూర్‌లో శాంతి పరిస్థితులు: ప్రధాని

ఇటీవల మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. త్వరలోనే అక్కడ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంది. ప్రజలు ఈ శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. శాంతి ద్వారానే దేశం వృద్ధి చెందుతుంది. శాంతిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతాయన్నారు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది పదోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదేళ్ల యూపీఏ పాలనలో వరుసగా 10 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.


ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

 ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు



రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

ఎర్రకోటకు వెళ్లే ముందు ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ చేరుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.





Background

Independence Day 2023 LIVE Updates: 77వ స్వాతంత్య్ర వేడుకుల కోసం దేశం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమ మోదీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆయనకు ఇద్దరు మహిళా అధికారులు మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్‌ కౌర్‌ సహాయ పడతారు. తర్వాత ఆకాశంలో ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌కు చెందిన మార్క్‌-3 ధృవ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్‌ పూల వర్షం కురిపిస్తాయి. 


ప్రధాని జాతీయ జెండా ఎగరవేస్తుండగా నయూబ్‌ సుబదార్ జితేందర్ సింగ్‌ నేతృత్వంలోని 21 మంది టీంతో కూడిన ఆర్మీ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెండా వందనం పూర్తైన తర్వాత సర్వసైన్యం ప్రధానికి గౌరవ వందనం తెలపనున్నాయి. ఇందులో ఒక్కో విభాగానికి ఒక్కో అధికారి లీడ్ చేస్తారు. ఇందులో 25 మంది సభ్యులు ఉంటారు.


అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఏడాది వేడుకులకు 1800 ప్రత్యేక ఆహ్వానితులను వేడుకల్లో అతిథులుగా పిలిచారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, రైతులు, పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి, పీఎం కౌశల్ వికాశ్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు భవన నిర్మాణ కార్మికులు, నేత కార్మికులు, అమృత్ సరోవర్, హర్‌ ఘర్ జల్‌ యోజనలో పాల్గొన్న వారితోపాటు టీచర్స్, నర్సులు, మత్స్యకారులను ఆహ్వానించారు. 


ఎర్రకోట వద్ద వేడుకులకు 10 వేల మందితో భద్రత కల్పించారు. ఎయిర్‌ డిఫెన్స్ తుపాకులతోపాటు యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖాలను గర్తుపట్టే సీసీస టీవీ కెమెరాలను ఉంచారు. 


ఆంధ్రప్రదేశ్‌లో వేడుకలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. సీఎం జగన్ జాతీయ జెండాను ఎగరవేయనున్నవారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ శాంతి భద్రతలను అడిషనల్ డీజీపీ శంక భ్రత బాగ్చీ పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషన్ కాంతి రాణా టాటా ఆయనకు సహకరించారు. ఉదయం 9 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అతిథులు, 8గంటలకు ప్రాంగణానికి చేరుకునేలా ప్లాన్ చేశారు. 


దేశవ్యాప్తంగా 954 మంది పోలీసులకు పోలీస్ మెడల్ ఫర్‌ గ్యాలంట్రీ సేవా పతకం 229 మందికి వచ్చింది. 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 642 మందికి పోలీస్‌ విసిష్ట సేవా పతకాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ మంది జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉన్నారు. ఆ రాష్ట్ర పోలీసలకు 55 పతకాలు వస్తే మహారాష్ట్రకు చెందిన 33 మందికి పతకాలు అందనున్నాయి. ఏపీకి 29 మందికి పతకాలు లభించాయి. ఇందులో ఒకరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, 10 మందికి పోలీస్‌ విశిష్ట సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంట్రీ పతకాలు లభించాయి. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుతవం ఇచ్చిన ఈ మెడల్స్‌ను పోలీసులకు సీఎం జగన్ అందజేయనున్నారు. 


తెలంగాణలో ఇలా 
తెలంగాణ స్వాతంత్య్ర వేడుకలు గోల్కొండ కోటలో జరగనున్నాయి. దీనికి విస్తృత ఏర్పాట్లు చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జెండా ఆవిష్కరణ తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సేవా పతకాలను అందుకున్న 34 మంది పోలీసులకు వాటిని అందజేస్తారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.