Independence Day 2023: దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 15 ఆగస్టు 1947న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలిసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ప్రధాని ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. పదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న నాలుగో ప్రధాని మోదీగా రికార్డుల్లోకి ఎక్కారు.
ఉదయం 7.30 గంటలకు ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీసులు ప్రధానికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత జాతీయ గీతం ఆలాపన ఉంటుంది. తర్వాత 21 గన్ సెల్యూట్ చేస్తారు. వేడుక ముగిశాక జెండా రంగుల్లో ఉండే బెలూన్లను ఆకాశంలోకి వదులుతారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరేసిన ఘనత మొదటి ప్రధాని అయిన నెహ్రూకి ఇంది. తర్వాత స్థానం ఆయన కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉంది. జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానుల జాబితా ఓ సారి చూద్దాం.
దేశానికి తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ 15 ఆగస్టు 1947న ఎర్రకోటపై తొలిసారి జెండాను ఎగురవేశారు. 27 మే 1964 వరకు దాదాపు 18 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా పనిచేసిన ఆయన స్వాతంత్య్ర దినోత్సవం రోజున 17 సార్లు జెండాను ఎగురవేశారు. అత్యధిక సార్లు జెండా ఎగురవేసిన ప్రధానుల జాబితాలో జవహర్ లాల్ నెహ్రూ అగ్రస్థానంలో ఉన్నారు.
ఇందిరాగాంధీకి రెండో స్థానం దక్కతుంది. ఇందిరాగాంధీ 16 సార్లు జెండాను ఎగురవేశారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు, 14 జనవరి 1980 నుంచి 31 అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా పనిచేశారు. ఎర్రకోటపై జెండాను ఎగరేశారు.
మన్మోహన్ సింగ్ వరుసగా పదేళ్లు దేశ ప్రధానిగా పనిచేశారు. 10 మే 22 నుంచి 2004 మే 26 వరకు 2014 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 2014 మే10న తొలిసారి ప్రధాని అయ్యారు.