77వ స్వాతంత్య్ర వేడుకుల కోసం దేశం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమ మోదీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆయనకు ఇద్దరు మహిళా అధికారులు మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్‌ కౌర్‌ సహాయ పడతారు. తర్వాత ఆకాశంలో ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌కు చెందిన మార్క్‌-3 ధృవ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్‌ పూల వర్షం కురిపిస్తాయి. 


ప్రధాని జాతీయ జెండా ఎగరవేస్తుండగా నయూబ్‌ సుబదార్ జితేందర్ సింగ్‌ నేతృత్వంలోని 21 మంది టీంతో కూడిన ఆర్మీ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెండా వందనం పూర్తైన తర్వాత సర్వసైన్యం ప్రధానికి గౌరవ వందనం తెలపనున్నాయి. ఇందులో ఒక్కో విభాగానికి ఒక్కో అధికారి లీడ్ చేస్తారు. ఇందులో 25 మంది సభ్యులు ఉంటారు.


అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఏడాది వేడుకులకు 1800 ప్రత్యేక ఆహ్వానితులను వేడుకల్లో అతిథులుగా పిలిచారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, రైతులు, పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి, పీఎం కౌశల్ వికాశ్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు భవన నిర్మాణ కార్మికులు, నేత కార్మికులు, అమృత్ సరోవర్, హర్‌ ఘర్ జల్‌ యోజనలో పాల్గొన్న వారితోపాటు టీచర్స్, నర్సులు, మత్స్యకారులను ఆహ్వానించారు. 


ఎర్రకోట వద్ద వేడుకులకు 10 వేల మందితో భద్రత కల్పించారు. ఎయిర్‌ డిఫెన్స్ తుపాకులతోపాటు యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖాలను గర్తుపట్టే సీసీస టీవీ కెమెరాలను ఉంచారు. 


ఆంధ్రప్రదేశ్‌లో వేడుకలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. సీఎం జగన్ జాతీయ జెండాను ఎగరవేయనున్నవారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ శాంతి భద్రతలను అడిషనల్ డీజీపీ శంక భ్రత బాగ్చీ పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషన్ కాంతి రాణా టాటా ఆయనకు సహకరించారు. ఉదయం 9 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అతిథులు, 8గంటలకు ప్రాంగణానికి చేరుకునేలా ప్లాన్ చేశారు. 


తెలంగాణలో ఇలా 
తెలంగాణ స్వాతంత్య్ర వేడుకలు గోల్కొండ కోటలో జరగనున్నాయి. దీనికి విస్తృత ఏర్పాట్లు చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జెండా ఆవిష్కరణ తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సేవా పతకాలను అందుకున్న 34 మంది పోలీసులకు వాటిని అందజేస్తారు. 


తెలుగు పోలీసులకు పతకాలు 


దేశవ్యాప్తంగా 954 మంది పోలీసులకు పోలీస్ మెడల్ ఫర్‌ గ్యాలంట్రీ సేవా పతకం 229 మందికి వచ్చింది. 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 642 మందికి పోలీస్‌ విసిష్ట సేవా పతకాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ మంది జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉన్నారు. ఆ రాష్ట్ర పోలీసలకు 55 పతకాలు వస్తే మహారాష్ట్రకు చెందిన 33 మందికి పతకాలు అందనున్నాయి. ఏపీకి 29 మందికి పతకాలు లభించాయి. ఇందులో ఒకరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, 10 మందికి పోలీస్‌ విశిష్ట సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంట్రీ పతకాలు లభించాయి. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుతవం ఇచ్చిన ఈ మెడల్స్‌ను పోలీసులకు సీఎంలు అందజేయనున్నారు.