CBSE Class 10th, 12th Result 2022: సీబీఎస్‌ఈ రిజల్ట్స్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌- స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ ఇలా చేయండి

CBSE Class 10th, 12th Result 2022: సీబీఎస్‌ఈ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోపాటు రిజల్ట్స్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఏబీపీ దేశం మీకు అందిస్తుంది.

Continues below advertisement

ఏపీలో ఇంటర్, టెన్త్‌, తెలంగాణలో ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయి. ఇప్పుడు సీబీఎస్‌ఈ రిజల్ట్స్ ఎప్పుడా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. సీబీఎస్‌ఈ(CBSE) బోర్డ్ 10, 12 ఫలితాల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా ఈ ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  విశ్వసనీయ సమాచారం ప్రకారం సీబీఎస్‌ఈ(CBSE) 10వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసిందని... తుది వెరిఫికేషన కోసం పంపినట్టు తెలుస్తోంది. ఫలితాలు ఒకసారి విడుదల చేస్తే విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌ cbseresults.nic.in వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు. ఏబీపీ దేశం కూడా ఫలితాల లింక్‌ను మీకు అందిస్తుంది. సీబీఎస్‌ఈ (CBSE) తుది ఫలితాల టైం,డేట్‌, ఉత్తీర్ణత శాతం మొదలైన అన్ని అప్‌డేట్‌ల కోసం telugu.abplive.com చూస్తూ ఉండండి. 

Continues below advertisement

CBSE Class 10th, 12th Result 2022: తాజా అప్‌డేట్‌లు ఏంటంటే?

ఫలితాల కోసం సిద్ధంగా ఉండాలని కోరుతూ అనుబంధ పాఠశాలలకు సీబీఎస్‌ఈ (CBSE) ఒక ముఖ్యమైన సర్క్యులర్‌ను జారీ చేసింది. ఫలితాల విడుదలకు సంబంధించిన వర్క్ నడుస్తుందని బోర్డు తెలియజేసింది. ఎలాంటి సమాచారం కావాలన్నా ఇచ్చేందుకు స్కూల్ హెడ్స్‌, అధికారులు అందుబాటులో ఉండాలని కోరింది. సీబీఎస్‌ఈ (CBSE) 12th మూల్యాంకన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ ఫలితాలు ప్రాసెస్ చేయడానికి 10వ ఫలితాలను నిలిపివేశారు.. రెండు ఫలితాలను ఒకే సమయంలో విడుదల చేసే అవకాశం ఉందని ఓ సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. అందుకే 10వ ఫలితాలు జూలై 15 వరకు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. 

సీబీఎస్‌ఈ(CBSE) టర్మ్ 1, టర్మ్ 2 ఫలితాలతో విద్యార్థులు సింగిల్ కంబైన్డ్ మార్క్ షీట్ పొందుతారు. 2022కి సంబంధించిన మార్క్ షీట్‌లు 2021 లేదా అంతకు ముందు సంవత్సరానికి చెందిన వాటిలానే కనిపిస్తాయి. టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా తుది ఫలితాన్ని బోర్డు ప్రకటిస్తుంది.

ఈ కింది వెబ్‌సైట్‌లలో సీబీఎస్‌ఈ టర్మ్ 2 ఫలితాలు తెలుసుకోవచ్చు. 
cbseresults.nic.in
results.gov.in
digilocker.gov.in

సీబీఎస్‌ఈ టర్మ్ 2 మార్క్‌షీట్, స్కోర్‌కార్డ్‌ని ఇలా డౌన్‌లౌడ్ చేసుకోండి 
ముందు పైన సూచించిన అధికారిక వెబ్‌సైట్‌లలో ఒకదానిపై క్లిక్ చేయండి. హోమ్‌పేజీలో సీబీఎస్‌ఈ టర్మ్ 2 క్లాస్ 12 ఫలితం లేదా సీబీఎస్‌ఈ టర్మ్ 2 క్లాస్ 10 ఫలితం 2022 అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. మీ రోల్ నంబర్ లాంటి వివరాలు టైప్ చేయండి. మీ  సీబీఎస్‌ఈ టర్మ్ 2 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. సీబీఎస్‌ఈ టర్మ్ 2 స్కోర్‌కార్డ్‌, మార్క్ షీట్  డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం ఆ స్కోర్‌ కార్డు, మార్క్‌షీట్‌ను ప్రింటవుట్ తీసుకోండి. 

Continues below advertisement
Sponsored Links by Taboola