IAFs MiG 29 Fighter Jet Crashes : న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 యుద్ధ విమానం సోమవారం నాడు కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగ్ 29 ఫైటర్ జెట్ పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయలుదేరి ఆగ్రాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనపై డిఫెన్స్ అధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
యుద్ధ విమానం కూలిన విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు మిగ్ 29ను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. యుద్ధ విమానం కొన్ని నిమిషాల్లోనే మంటల్లో కాలిపోయింది. అయితే ఏ కారణంగా ఫైటర్ జెట్ కుప్పకూలిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.