How To Live Longer: మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..

మనిషి మరణాన్ని జయించడం సాధ్యమేనా? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే విషయాలపై నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

ABP Network Ideas Of India 2025 | ఎన్నో ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్న ఒకటి ఉంది. వందల సంవత్సరాలుగా ఆ విషయంలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నా సక్సెస్ సాధించలేకపోతున్నారు. కానీ సృష్టి రహస్యాలలో అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అదేందంటే.. మనుషులు ఎందుకు చనిపోతారు ? వృద్ధాప్యాన్ని జయించడం సాధ్యం కాదా? మరణాన్ని జయించడం ఎలా...? అనే అంశంపై నోబెల్ బహుమతి గ్రహీత, రాయల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్ (Venki Ramakrishnan) కీలక విషయాలు తెలిపారు. ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 (Ideas Of India)లో 'ది సైన్స్ ఆఫ్ ఏజింగ్' సెషన్‌లో పాల్గొని సైంటిస్ట్ వెంకీ రామకృష్ణన్  ఎన్నో విలువైన విషయాలు షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

మనిషి జీవితకాలం 110- 112 ఏళ్లు

మరణాన్ని జయించడంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎక్కువ కాలం జీవించడం ఎలా అనే అంశాలు తెలిపారు. అది కూడా జీవితాంతం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నోబెల్ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త సూచించారు. వెంకీ రామకృష్ణన్ మాట్లాడుతూ.. సాధారణంగా మానవుల జీవితకాలం 110- 112 ఏళ్లు కాగా, కొన్నేళ్లుగా శతాధిక వయస్సు గల వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. "శతాధిక వయసు వారంటే.. 100 అంతకంటే ఎక్కువ కాలం జీవించడం. గత కొన్నేళ్లుగా వందేళ్లు పైగా జీవించిన వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కోట్ల  మంది ఎనభై ఏళ్లకు చేరుకుంటున్నారు. వారిలో చాలా మంది మరింత కాలం జీవించే అవకాశం ఉంది. 

యాంటీ ఏజింగ్ కోసం భారీగా పెట్టుబడులు

కానీ 110 ఏళ్లకు మించి జీవిస్తున్న వారి సంఖ్య పెరగడం లేదు. అది శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. జీవశాస్త్రంలో అది సహజ ప్రక్రియ. అయితే ఆరోగ్యంగా వృద్ధాప్యానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం జన్యువుల్లో వస్తున్న మార్పులు, మనుషుల అలవాట్లు లాంటివి వృద్ధ్యాప్యంపై ప్రభావం చూపుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ అవయవాల పనితీరు మందగిస్తుంది. గత 10 ఏళ్లలో వృద్ధాప్యానికి సంబంధించి 3 లక్షలకు రీసెర్చ్ పేపర్లు పుట్టుకొచ్చాయి. యాంటీ ఏజింగ్ ( వృద్ధాప్యం రాకుండా) చూసేందుకు చేస్తున్న పరిశోధనల కోసం 700 సంస్థలు భారీగా ఇస్వెస్ట్ చేశాయని’ వెంకీ రామకృష్ణన్ వెల్లడించారు. 

ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రీసెర్చ్ కంటే కొన్ని ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం దోహదం చేస్తుందని కొన్ని చిట్కాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ స్నేహితుల్ని కలిగి ఉండాలి. అందరితో కలుపుగోలుగా ఉండటం ముఖ్యం. ఒంటరిగా ఉండటం, ఒంటరితనంగా ఫీలవడం చేయకూడదు. ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి, దాని కోసం తపించే వారు.. ఎలాంటి గోల్స్ లేని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని సైంటిస్ట్ వెంకీ రామకృష్ణన్ పేర్కొన్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో పాటు కంటి నిండా నిద్ర, ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయాలని సూచించారు. ఇలాంటి ఆరోగ్య చిట్రాలు నిరంతరం పాటించడం ద్వారా ఒత్తిడి దూరమై ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

Also Read: Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్

Continues below advertisement
Sponsored Links by Taboola