From Strategy To Success: అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన పని లేదు. ఇది ఇప్పుడు నరేంద్రమోదీకి సరిగ్గా సరిపోతోంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత్‌ వాయు రక్షణ, దాడి సామర్థ్యాలు ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా మార్చేశాయి. ఇదే నిదర్శనం ఆయన దూరదృష్టికి. ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత జరిగిన పరిణామాలు దేశం వాయు రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో మోదీ ప్రభుత్వం చేసిన అవిశ్రాంత కృషికి నిదర్శనంగా ఉన్నాయి. భారత్‌ తన గగనతలాన్ని రక్షించుకోవడమే కాకుండా ప్రపంచ వేదికపై తన శక్తిని నిరూపించుకో గలిగింది.  

జాతీయ భద్రతకు దార్శనిక విధానంజాతీయ భద్రత పట్ల ప్రధానమంత్రి మోదీ అచంచలమైన నిబద్ధత ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది. గత దశాబ్దంలో భారత్‌ రక్షణ మౌలిక సదుపాయాలను వ్యూహాత్మకంగా మార్చడానికి ఆ నిబద్దత దారితీసింది. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీ అత్యాధునిక సాంకేతికత, వ్యవస్థలలో పెట్టుబడులపై ఫోకస్ చేసారు. దీని వల్ల భారత్‌ తన గగనతలాన్ని కాపాడుకోవడంలో సొంత శక్తిపై ఆధారపడగలిగింది. దీని కోసం బలమైన, మల్టీ లేయర్‌ వాయు రక్షణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టింది. ఏదైనా ముప్పుకు వేగంగా పసిగట్టి కచ్చితత్వంతో రియాక్ట్ అయ్యే వాయు రక్షణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఇటీవల ప్రారంభించిన క్షిపణి దాడులు సమర్థవంతంగా తిప్పికొట్టాయి మనై సేనలు. భారత సాయుధ దళాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో సన్నద్ధం చేయడంలో మోదీ ప్రభుత్వం చూపిన దూరదృష్టి కారణంగా ఇది సాధ్యమైంది. పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి క్షిపణిని అడ్డగించిన విధానం మన వద్ద ఉన్న వ్యవస్థల సామర్థ్యాన్ని చెబుతోంది. వేగవంతమైన, సమన్వయంతో రియాక్ట్ అయిన విధానం భారత్‌లో బలపడిన వాయు రక్షణకు స్పష్టమైన సూచనగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఆధునీకరణపై దశాబ్ద కాలంగా చేసిన పెట్టుబడి ఫలితంగా ఇది  సాధ్యమైంది. 

మోదీ ప్రభుత్వ దూరదృష్టి భారతదేశ భద్రత కోసం మోదీ ప్రభుత్వ దూరదృష్టితో  నిర్ణయాలు తీసుకుంది. లేటెస్ట్ వాయు రక్షణ వ్యవస్థలు, సాంకేతికతలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. భారతదేశ రక్షణను బలోపేతం చేసిన కీలక కొనుగోళ్లు పరిణామాలు ఇవే:

S-400 ట్రయంఫ్ సిస్టమ్స్: ఈ అత్యాధునిక S-400 క్షిపణి వ్యవస్థల ఐదు స్క్వాడ్రన్‌ల ఒప్పందం 2018లో జరిగింది.  ₹35,000 కోట్లకు సంతకాలు జరిగాయి. ఇది ఇప్పుడు  దేశ వాయు రక్షణ సామర్థ్యంలో గేమ్-ఛేంజర్‌గా నిలిచింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు పని చేస్తున్నాయి. అంటే భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా ఉంది.

బరాక్-8 క్షిపణులు: 2017లో ఇజ్రాయెల్‌తో 2.5 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరింది. బరాక్-8 మధ్యస్థ-శ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను భటిండా వంటి కీలక ప్రదేశాల్లో ఉంచింది. ఈ క్షిపణులు భారతదేశ ఫ్రంట్‌లైన్ రక్షణలో కీలకమైన భాగంగా ఉన్నాయి.

స్వదేశీ వ్యవస్థలు: మోదీ ప్రభుత్వం స్వశక్తిపై దృష్టి పెట్టడం వల్ల ఆకాశ్ క్షిపణులు, DRDO-అభివృద్ధి చేసిన కౌంటర్-డ్రోన్ టెక్నాలజీలు వంటి స్వదేశీ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవస్థలు భారతదేశం తన భద్రతా అవసరాల కోసం విదేశీ వనరులపై ఆధారపడకుండా చేస్తున్నాయి.  

ప్రపంచానికి భారత్‌ సందేశం

ఆపరేషన్ సిందూర్ కేవలం రక్షణాత్మక బలం గురించి మాత్రమే కాదు. ఇది భారతదేశం శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించింది. మోదీ నాయకత్వంలో భారత్‌ బలీయమైన రక్షణ వ్యవస్థను నిర్మించుకోవడమే కాకుండా ఆపరేషన్ నిర్వహించడంలో చూపిన కచ్చితత్వం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్‌ అభివృద్ధి చేసిన సూసైడ్‌ డ్రోన్‌లు ఆపరేషన్‌ను విజయవంతం చేశాయి. ఇవి కీలకమైన లక్ష్యాలపై అనుకున్నట్టుగానే దాడులు చేశాయి. 

అంతేకాకుండా, ఇజ్రాయెల్‌కు చెందిన హారప్ డ్రోన్‌లు,  SCALP, HAMMER వంటి అధునాతన క్షిపణులతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్‌లను ఉపయోగంతో భారత్‌ దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. ఈ ఆధునిక ఆయుధాలు, దళాల వేగవంతమైన సమన్వయంతో కూడిన స్పందన ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపాయి. తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి  సాటిలేని శక్తిసామర్థ్యాలతో మోదీ నాయకత్వంలో భారత్‌  సిద్ధంగా ఉంది అనే మెసేజ్ ప్రపంచానికి వెళ్లింది. 

జాతీయ భద్రతపై మోదీకి ఉన్న ఆలోచన స్వల్పకాలిక విజయాల గురించి కాదు; ఇది దీర్ఘకాలికంగా బలోపేతం కోసం, దానికి తగ్గ పునాది వేయడం గురించి. గత దశాబ్దంలో మోదీ ప్రభుత్వం పద్దతి ప్రకారం బలమైన, సాంకేతికతతో నడిచే వైమానిక రక్షణ నెట్‌వర్క్‌ నిర్మించింది, ప్రమాదాన్ని ముందే పసిగట్టి భారత గగనతలానికి చేరుకునే లోపు గుర్తించడం, వాటిని టార్గెట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక విజయం మాత్రమే కాదు , ఇది దేశ రక్షణ వ్యూహంలో ప్రధానమంత్రి మోదీ నింపిన మానసిక బలం, ఆలోచన విధానం. భారతదేశం ఇప్పుడు తన గగనతలాన్ని నిర్భయంగా కచ్చితత్వంతో నియంత్రించుకోగలదు. వచ్చే సవాళ్లు ఏవైనా ఉన్నా ఎదుర్కోవడానికి భారత్‌ కట్టుబడి ఉందని మోదీ ప్రభుత్వం నిరూపించింది.