హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వాన- శివాలయం కూలి 16 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. రాష్ట్రంలోని సోలన్ లో ఉన్న మామ్లిక్‌ లోని ధయావాలా గ్రామం సహా పలు ప్రాంతాల్లో వరదలు ముంచుకొచ్చాయి. భారీ వర్షానికి శివాలయం కూలిపోయింది.

Continues below advertisement

హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా రాష్ట్రం అతలాకుతలమైంది రాష్ట్రంలోని సోలన్ లో ఉన్న మామ్లిక్‌ లోని ధయావాలా గ్రామం సహా పలు ప్రాంతాల్లో వరదలు ముంచుకొచ్చాయి. భారీ వర్షానికి శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించగా మరో 8 మందిని అక్కడ సిబ్బంది రక్షించారు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది.

Continues below advertisement

ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఒక్కసారిగా ముంచుకు వచ్చిన వరదల కారణంగా రెండు ఇళ్లు, ఓ గోశాల కూడా కొట్టుకుపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్ లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు కొన్ని కార్యాలయాలను మూసి వేయించారు. 

వర్షాలు అధికంగా పడుతుండటంతో పర్వతాల కొండచరియలు విరిగిపడుపోతుంటాయి. సోమవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం ప్రతిపాదిత పరీక్షలను కూడా వాయిదా వేసింది. భారీ కొండ చరియలు విరిగి పడటంతో కులు మనాలికి వెళ్లే దారులు అన్ని మూసుకుపోయాయి.

వర్షాల కారణంగా ఇప్పటి వరకూ రూ.7,020 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అన్ని సౌకర్యాలను, పనులను సజావుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌ , ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వివరించింది.చంబా, కాంగ్రా, హమీర్‌పూర్, మండి, బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా జిల్లాలోని పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Continues below advertisement