Sabarimala Rush: పంబ వద్ద గందరగోళం- రోడ్డుపైనే పాటలు పాడుతూ అయ్యప్ప భక్తుల ఆందోళన

అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Continues below advertisement

Heavy Rush To Sabarimala Darshan: అయ్యప్పస్వామి (Ayyappa Darshanam) దర్శనం కోసం శబరిమల ( Sabarimala )కు భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంబకు వాహనాలు అనుమతించడం (No Vehicle Entry )లేదు. దీంతో రోడ్డుపైనే పాటలు పాడుతూ అయ్యప్ప భక్తుల ఆందోళనకు దిగారు. 

Continues below advertisement

శబరిమలకు భక్తులు పొటెత్తడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో...అధికారులు పంబాకు వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు . ఫలితంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రోడ్డుపైన నిరసనకు దిగారు. ఎరుమెలి- పంబా రోడ్డుపై అయ్యప్ప పాటలు పాడుతూ ఆందోళన నిర్వహించారు. పంబాకు వాహనాలు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని...అయ్యప్ప భక్తులతో  ఆందోళనను విరమింపజేశారు. భక్తుల రద్దీ అదుపులోకి వచ్చాక వాహనాలను అనుతిస్తామని హామీ ఇవ్వడంతో భక్తులు వెనక్కితగ్గారు. భక్తుల ఆందోళనలపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణన్​ స్పందించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామన్న ఆయన, భక్తుల కోసం ఆర్​టీసీ బస్సులను సైతం వినియోగిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆన్​లైన్​ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Continues below advertisement