కేరళలో కనిపించే రాంబూటన్ అనే ఫ్రూట్ చాలా డిఫరెంట్. చూడ్డానికి చుట్టూ మెత్తటి ముళ్లతో, ఎరుపు రంగులో ఉంటుంది. పైన తొక్క తీస్తే లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. మనం తినగలిగే గుజ్జు కలిగి ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఈ రాంబూటన్ ఫ్రూట్‌ని హెయిరీ లిచీ (Hairy Lychee) అంటారు. కానీ ఇది మన దగ్గర దొరికే లిచీ పండు మాత్రం కాదు.
ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌లో రాంబూటన్ ఫ్రూట్ పుట్టినట్లుగా చెప్తారు. మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇది దొరుకుతుంది. రాంబుటాన్ చెట్లు బాగా పెరగాలంటే వెదర్ కండీషన్స్ కొంచెం కూల్‌గా ఉండాలి. గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ ఏపుగా పెరుగుతాయి. ఇండియాలో కొన్నేళ్ల నుంచి కేరళ, వెస్ట్‌బెంగాల్ రాష్ట్రంలో ఈ రాంబూటన్ సాగు మొదలైనది. ఇక్కడ కూడా చాలా రేర్‌గా పంట సాగు చేస్తున్నారు. ఈ పంట పండే ప్రాంతాల్లో వర్షపాతం 200 సెంటీమీటర్లకుపైగా ఉండాలి. అందుకే కేరళలో ఇంటికో చెట్టు ఉంటుంది.
రాంబూటన్ చెట్లు సుమారు 12 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఈ విత్తనాలు నాటిన 15 రోజుల్లో మొలకెత్తుతాయి. గింజల నుంచి మొలకెత్తిన చెట్లు సుమారు 6 - 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. ఇందులోనే కాస్త డిఫరెంట్‌గా ఉండే రకాలు మాత్రం 3 లేదా 4 సంవత్సరాల్లోనే కాపుకొస్తాయి. కాచిన కాయలు పక్వానికి రావడానికి 4 - 5 నెలలు పడుతుంది. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మెట్టప్రాంతాలు కూడా రాంబూటన్ సాగు అనుకూలం అని అంటారు.
కేరళలో ఈ పంట చాలా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, చాలా మంది ఇళ్ల ఆవరణలో దీన్ని పెంచుకుంటారు. అక్కడ కాపుకొచ్చిన పండ్లని ఇలా ఎవరికి వారు రోడ్ల పక్కన అమ్ముతారు. కేరళలో మాత్రం దీని ధర కాస్త తక్కువగా ఉంటుంది. సొంత చెట్లకే పెరిగిన కాయల్ని అమ్ముతారు కాబట్టి.. కిలో రూ.300 రేంజ్‌లోనే ఇక్కడ ధర ఉంటుంది. మన దగ్గర మాత్రం రాంబూటన్ కాయల ధర కొంచెం ఎక్కువే. మన దగ్గర గ్రామాల్లో ఈ ఫ్రూట్స్ గురించి చాలా మందికి అస్సలు తెలియదు. హైదరబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబయి, చెన్నై లాంటి మెట్రో సిటీస్‌లో ఈ కాయలు డిఫరెంట్ ప్యాకేజ్‌తో పెద్దపెద్ద సూపర్ మార్కెట్స్‌లోనే, చాలా రేర్‌గా అందుబాటులో ఉంటాయి. కొన్ని నగరాల్లో దీని ధర కేజీ 600 రూపాయల దాకా పలుకుతుంది.
రాంబూటాన్ పండ్లు తింటే ఉపయోగాలు
యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బీ1, బీ2, బీ3,బీ5,బీ6,బీ9, విటమిన్ సీ, కాపర్, మాంగనీస్, పాస్పరస్, పొటాషియం, మెగ్నిషియం, సోడియం, ఐరన్ ఇందులో లభిస్తాయని చెప్తున్నారు. జ్యూస్, ఐస్ క్రీమ్, కేక్‌లలో వాడతారు. సౌత్ ఈస్ట్ కంట్రీస్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ఓంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది. జింక్ ఉండటం వల్ల హేయిర్‌కు మంచింది. ఈ ఫ్రూట్ తింటే స్కిన్‌కు కూడా మంచిదంటున్నారు. మలబద్దకం సమస్యను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. డయాబిటెక్ సమస్య ఉన్నవారు కూడా తినవచ్చు. ఈ రాంబూటాన్ పండు ఆరోగ్యానికి చాలా మంచింది. ఎన్నో గుణాలు ఉన్న రాంబూటాన్ మీకు ఎక్కడైనా కనపడితే మిస్ కాకుండా తినండి.