Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను వారణాసి సివిల్ కోర్టులో సమర్పించారు. వీడియోను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించారు కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్.






అయితే ఈ నివేదికలో పలు షాకింగ్ విషయాలు కమిటీ ప్రస్తావించినట్లు సమాచారం. జ్ఞానవాపి మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీంతో పాటు మసీదులో ఆలయ అవశేషాలను గుర్తించినట్లు సమాచారం. విగ్రహాల ముక్కలున్నాయని కోర్టుకు తెలిపింది.


నివేదికలో



  • స్వస్తిక్, శేషనాగు గుర్తులు ఉన్నట్లు తెలిపిన కమిటీ

  • శిలాఫలకాలపై కమలం పువ్వులు గుర్తింపు.

  • సింధూర వర్ణంలో నాలుగు దేవాతాముర్తుల విగ్రహాల గుర్తింపు. 

  • శృంగార గౌరీదేవీ మాతా మందిరానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు కమిటీ నిర్ధారణ 


మరోవైపు శివలింగం కనిపించినచోట తక్షణమే పూజలకు అనుమతించాలని కాశీ విశ్వ నాథ ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. మసీదు మొత్తాన్ని పురావస్తు శాఖ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.


సుప్రీం బ్రేకులు






వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు వేసింది. మే 20 వరకు విచారణ ఆపేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు.


ఇదీ కేసు


జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.


Also Read: Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!


Also Read: Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు