Azaan Ban Petition: 



అజాన్‌ని నిషేధించాలంటూ..


మసీదులో నుంచి వచ్చే ప్రార్థనల వల్ల ఎలాంటి ధ్వని కాలుష్యం జరగదని తేల్చి గుజరాత్ హైకోర్టు (Gujarat High court). పెద్ద పెద్ద స్పీకర్‌లు పెట్టి అజాన్ చేయడం వల్ల సౌండ్ పొల్యూషన్ అవుతోందని, దీనిపై నిషేధం విధించాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ని కొట్టి పారేసిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ వేయడాన్ని తప్పుబట్టింది. గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ని కొట్టివేసింది. అజాన్‌ (Azaan Ban) కారణంగా శబ్దకాలుష్య స్థాయి పెరుగుతోందని, పరిమితికి మించిన డెసిబెల్స్‌ వినాల్సి వస్తోందన్న వాదనను ఖండించింది. ఈ పిటిషన్‌ ఉద్దేశమేంటో తమకు అర్థం కాలేదని స్పష్టం చేసింది. 


"మీ పిటిషన్ ఉద్దేశమేంటో మాకు అర్థం కాలేదు. లౌడ్‌స్పీకర్‌లలో అజాన్ వినిపించడం వల్ల శబ్దకాలుష్యం పెరుగుతుందని ఎలా అనగలరు..? దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని మీరు పిటిషన్ ఎందుకు వేశారో తెలియడం లేదు"


- గుజరాత్ హైకోర్టు


బజ్‌రంగ్ దళ్ నేత పిటిషన్..


బజ్‌రంగ్ దళ్ నేత శక్తిసిన్హ్ దలా ఈ పిటిషన్ వేశారు. పెద్ద స్పీకర్లలో ప్రార్థనలు వినిపించడం వల్ల చాలా మంది అసౌకర్యానికి గురవుతున్నారని, కొందరి ఆరోగ్యమూ దెబ్బ తింటోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ వాదననే గుజరాత్‌ హైకోర్టు తప్పుబట్టింది. 


"గుళ్లలోనూ ఉదయం 3 గంటలకే హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో డ్రమ్స్ వాయిస్తూ హారతినిస్తారు. ఆ శబ్దం వల్ల ధ్వని కాలుష్యం కాదా..? గంట వాయిస్తుంటే ఆ శబ్దం కేవలం గుడికే పరిమితమవుతుందా..? బయటకు వినబడకుండా ఉంటుందా. ఇలాంటి పిటిషన్‌లను ఏ మాత్రం ఉపేక్షించం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఆచారమది. ఓ 10 నిముషాల ప్రార్థన గురించి దాన్ని కాదనలేం కదా"


- గుజరాత్ హైకోర్టు


రోజులో రకరకాల సమయాల్లో అజాన్‌ నిర్వహిస్తారని వివరించిన గుజరాత్ హైకోర్టు...సౌండ్ పొల్యూషన్‌ని కొలవడానికి ఓ సైంటిఫిక్ మెథడ్ ఉంటుందని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలేవీ పిటిషన్‌లో లేవని మండి పడింది. 10 నిముషాల అజాన్ వల్ల ఎంత ధ్వని కాలుష్యం నమోదవుతుందో చెప్పాలని అడిగింది.  


Also Read: China Pneumonia Outbreak: చైనా ఫ్లూ కేసులపై ఆ 5 రాష్ట్రాలు అప్రమత్తం, చిన్నారులు జాగ్రత్త అంటూ హెచ్చరికలు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply