Best Guidance For Gokarna Summer Trip: ఇండియాలోని చల్లటి ప్రదేశాల్లో గోకర్ణ ఒకటి. మహాబలేశ్వర్ టెంపుల్, ఓం బీచ్ చాలా పాపులర్. వేసవికి ఎక్కువ మంది ప్లాన్ చేసే ట్రిప్ ఇది. ఇంతేకాకుండా, వాటర్ స్పోర్ట్స్, షాపింగ్ కి గోకర్ణ చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గోకర్ణకి ఎలా వెళ్లాలి? అక్కడ ఏమేం చూడొచ్చు తెలుసుకోండి.


గోకర్ణలో ఏమేం చూడొచ్చు?


వెస్టర్న్ ఘాట్స్ తో చుట్టిముట్టి ఉన్న గోకర్ణ చాలా అందమైన ప్రదేశం. వీకెండ్ లో వెళ్ళి రావటానికి బెంగళూరు నుంచి ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు. ఓం బీచ్, దగ్గర్లో శివాలయం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో కూడా యాత్రికులు వస్తుంటారు. యేటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఓం బీచ్, పనంబూర్ బీచ్ తో పాటూ ఎక్కువమందికి తెలియని కుడ్లే బీచ్ కూడా గోకర్ణ లో చూడదగ్గది. మహాబలేశ్వర్ టెంపుల్, మహాగణపతి టెంపుల్, భద్రకాళీ టెంపుల్ చూడటం మిస్ అవకండి. మహాబలేశ్వర్ టెంపుల్ వెనకాల గోకర్ణ మెయిన్ బీచ్ ఉంటుంది. గోకర్ణ చుట్టుపక్కన టౌన్ నుంచి షార్ట్ ట్రెక్ లు చేస్తుంటారు. ఇది అక్కడ స్పెషల్ అట్రాక్షన్.


గోకర్ణలో ఏమేం చేయొచ్చు?


వాటర్ స్పోర్ట్స్


ఓం బీచ్ లో పారాసెయిలింగ్


బోట్ రైడింగ్చారిత్రాత్మక ప్రదేశాలు


కల్చరల్ వాక్


సైట్ సీయింగ్


గోకర్ణకు ఎలా వెళ్లాలి?


గోకర్ణ కర్ణాటకలో ఉంది. బెంగళూరు నుంచి గానీ, గోవా నుంచి గానీ కొన్ని గంటలే ప్రయాణం. ఇక్కడ ఎయిర్ పోర్ట్ లేనప్పటికీ, అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్ వే లో చేరుకోవచ్చు. విమానంలో గోవాకి చేరుకొని కూడా ఇక్కడికి రోడ్డు మార్గంలో రావొచ్చు. 


విమాన మార్గం 


గోవాలోని దబోలిమ్ విమానాశ్రయం గోకర్ణకు 140 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడికి చేరుకున్న తర్వాత టాక్సీలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచయితే హుబ్లీ ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి టాక్సీలో గోకర్ణ చేరుకోవచ్చు.


ట్రైన్ ద్వారా 


హైదరాబాద్ నాంపల్లీ నుంచి, సికింద్రాబాద్ నుంచి గోకర్ణకు ట్రైన్ ఉంది. గోకర్ణ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంకోలా వద్ద దగ్గర్లో రైల్వే స్టేషన్ ఉంది. మంగళూరు, ముంబై, తిరువనంతపురం, వెరావల్ సహా అనేక నగరాల నుండి వచ్చే రైళ్లు స్టేషన్‌లో ఆగుతాయి. స్టేషన్ నుండి, గోకర్ణకు టాక్సీ లో వెళ్లవచ్చు. 


రోడ్డు మార్గం


గోకర్ణ కు KSRTC బస్సులు బెంగళూరు, మంగళూరు, హుబ్లీ కర్ణాటకలోని ఇతర నగరాల నుంచి క్రమం తప్పకుండా తిరుగుతాయి. మడ్గావ్ , గోవాలోని ఇతర నగరాల నుంచి గోకర్ణకు బస్సులో కూడా ఎక్కవచ్చు. ముంబై నుండి కొచ్చిని కలిపే N17 నుండి గోకర్ణ కేవలం 10 కి.మీ దూరంలో ఉంది. ఆఛ్ లగ్జరీతో సహా బస్సులు రెండు నగరాల మధ్య క్రమం తప్పకుండా తిరుగుతాయి.


గోకర్ణలో మెడిటేషన్ రిసార్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. యోగా రీట్రీట్స్ కోసం వచ్చేవారూ ఎక్కువే. ఉరుకులపరుగుల జీవితంలో ప్రశాంతత కోసం బీచ్ లలో గడపటానికైనా, ఆధ్యాత్మిక దర్శనాలకైనా, రెజ్యూవినేటింగ్ స్పా లకైనా గోకర్ణ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఒంటరిగా ట్రిప్ కి వెళ్లేవారికైనా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెళ్లినా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం..ఈ సమ్మర్ వేకేషన్ గోకర్ణలో ప్లాన్ చేసేయండి.