Elections Voting Percentage: దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ముగిసింది. మంగళవారం (మే 7) సాయంత్రం 6 గంటలకు అన్ని చోట్ల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మూడో విడతలో 60.17 ఓటింగ్ శాతం నమోదైనట్లుగా ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఈ విడతలో మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దాదాపు 1351 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది.
గుజరాత్, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ఎన్నికలు మొత్తం ఈ మూడో ఫేస్ లోనే ముగిశాయి. అసోంలో నాలుగు సీట్లు, మధ్యప్రదేశ్ లో 8 సీట్లు, పశ్చిమ్ బంగాల్ లో నాలుగు సీట్లు, బిహార్ లో 5 సీట్లు, కర్ణాటకలో 14 సీట్లలో మంగళవారం మూడో విడతలో ఎన్నికలు జరిగాయి.
ఈ మూడో విడత ఎన్నికల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాద్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం (మూడో విడతలో మాత్రమే)
అసోం - 75.26% (నాలుగు స్థానాలు)
బిహార్ - 56.55% (5 స్థానాలు)
ఛత్తీస్ గఢ్ - 66.99% (ఏడు స్థానాలు)
డామన్ అండ్ డయ్యూ - 65.23% (2 స్థానాలు)
గోవా - 74.27% (2 స్థానాలు)
గుజరాత్ - 56.76% (25 స్థానాలు)
కర్ణాటక - 67.76% (14 స్థానాలు)
మధ్య ప్రదేశ్ - 63.09% (9 స్థానాలు)
మహారాష్ట్ర - 54.77% (11 స్థానాలు)
ఉత్తర్ ప్రదేశ్ - 57.34% (10 స్థానాలు)
పశ్చిమ బెంగాల్ - 73.93% (4 స్థానాలు)