G20 Summit 2023: 



ముగిసిన G20 సదస్సు..


రెండు రోజుల G20 సదస్సు (G20 Summit 2023) ముగిసింది. సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు భారత్‌కి వచ్చి కీలక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన ఢిల్లీ డిక్లరేష.న్ (New Delhi Declaration)పై ఏకాభిప్రాయానికి వచ్చారు. దీన్ని అన్ని దేశాలూ "Future Document"గా పరిగణిస్తున్నాయి. ఈ విషయంలో భారత్‌ చాలా చొరవ తీసుకుందనే చెబుతున్నారు నిపుణులు. ఈ డాక్యుమెంట్‌పై అన్ని దేశాలూ ఒకే అభిప్రాయంపై నిలబడడానికి ఇండియా దాన్ని డీల్ చేసిన విధానమే కారణమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా జియోపొలిటికల్ అంశంపై ఈ సదస్సులో చాలా పెద్ద చర్చే జరిగింది. పైగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడంపైనా అసహనం వ్యక్తమైంది. గత ఏడాది ఇండోనేషియాలోని బాలిలో G20 సమావేశాలు జరిగాయి. అప్పుడూ ఈ అంశంపై చర్చ జరిగింది. రష్యా తీరుని అన్ని దేశాలూ ఖండించాయి. కేవలం చైనా, ఇటలీ మాత్రమే రష్యాకు మద్దతు పలికాయి. ఇప్పుడూ అదే జరిగింది. అయితే...ఈ సమ్మిట్‌లో రష్యా ఉక్రెయిన్‌ అంశంలో ఏకాభిప్రాయం కుదరడం కష్టమైంది. డిక్లరేషన్‌లో దీని గురించి భారత్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో వినియోగించిన భాషపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏ మాత్రం రష్యాకి మద్దతుగా ఉన్నా..దాన్ని మార్చేయాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ తరవాత భారత్ చొరవ తీసుకుని ఆ టెక్స్ట్ మార్చేసింది. ఆ తరవాత కానీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా, యురోపియిన్ యూనియన్, రష్యా, చైనా..ఇలా అన్ని దేశాలూ అందు అంగీకరించాయి. సదస్సు మొదటి రోజే జాయింట్ డిక్లరేషన్‌పై చర్చలు జరిపింది భారత్. ఏ అంశంలోనూ భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తపడింది. 


డిక్లరేషన్‌లో ఏముంది..?


"ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలు ఈ అశాంతి కారణంగా ఎంతగా నలిగిపోతున్నారో మేం అర్థం చేసుకోగలం. వాళ్లపై యుద్ధ ప్రభావం ఏ మేర ఉంటుందో కూడా అంచనా వేయగలం. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో మేమంతా ఒక్కటిగానే ఉన్నాం. గతేడాది బాలిలో ఏ తీర్మానాలైతే చేశామో వాటికి కట్టుబడి ఉన్నాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాలకూ కట్టుబడే ఉంటాం. యూఎన్ ఛార్టర్‌కి అనుగుణంగా నడుచుకుంటాం. ఏ దేశంలో అయినా ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నా, భూభాగాల ఆక్రమణలు జరుగుతున్నా కచ్చితంగా మిగతా దేశాలు ఖండించాలని అందులో స్పష్టంగా రాసుంది. ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే జాయింట్ డిక్లరేషన్‌లో పలు అంశాలు ప్రస్తావించాం. ఇవి యుద్ధం చేసుకునే రోజులు కావు. One Earth,One Family,One Future థీమ్స్‌కి అనుగుణంగానే స్నేహపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది"


ఐరోపా సమాఖ్య ప్రశంసలు..


భారత్ G20 సదస్సుని నిర్వహించిన తీరుపై ఐరోపా సమాఖ్య ప్రశంసలు కురిపించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చి పూర్తిగా జియోపొలిటికల్‌ అంశాలపై చర్చ జరిపింది. రష్యా తీరుని ఖండిస్తూ జాయింట్ స్టేట్‌మెంట్‌లో వినియోగించిన భాషపైనా సంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది బాలిలో జరిగిన G20 సదస్సులో ఈ విషయంలో ఈ భాషపైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారని...భారత్ మాత్రం దాన్ని చాలా చాకచక్యంగా మార్చి అందరికీ ఆమోదయోగ్యమైన డిక్లరేషన్‌ని ప్రవేశపెట్టిందని ప్రశంసించింది. 


Also Read: Canada PM:కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం-దిల్లీలోనే ఉండిపోయిన ట్రూడో