Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్

Sukhbir Singh Badal Latest News: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు కలకలం రేపాయి. ఆయనపై కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

Continues below advertisement

Sukhbir Singh Badal Attack Bullets Fired:  పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి యత్నించాడు.  అయితే, ఆయనతోపాటు ఉన్న అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు . ఈ దాడిలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తృటిలో తప్పించుకున్నాడు. శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ ప్రకటించిన మతపరమైన శిక్ష ప్రకారం సుఖ్బీర్ సింగ్ బాదల్ సహా శిరోమణి అకాలీదళ్ నాయకులు డిసెంబర్ 2 నుంచి 'సేవ' చేస్తున్నారు.

Continues below advertisement

ఈ కాల్పులపై ఏడీసీపీ హర్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సురక్షితంగా ఉన్నారు. దాడి చేయడానికి వచ్చిన నారాయణ్ సింగ్ చౌరా మంగళవారం కూడా ఆలయంలోనే ఉన్నారని చెప్పారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ను విష్ చేసి గుడిలోకి వెళ్లారని తెలిపారు. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కాల్పులు జరిపాడు. అనుచరులు అక్కడ ఉన్నందున నేరుగా కాల్పులు జరపలేకపోయాడు. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

బాదల్‌కు అకల్ తఖ్త్ సాహిబ్ శిక్ష 

అకల్ తఖ్త్ సాహిబ్ విధించిన శిక్షను మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అనుభవిస్తున్నారు. అందులో భాగంగా గోల్డెన్ టెంపుల్ ప్రాణంలో సేవ చేస్తున్నారు. మంగళవారం కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణ దేవాలయంలోనే ఉన్నారు. దాదాపు గంటసేపు క్లాక్ టవర్ బయట సేవాదార్ దుస్తులు ధరించి ఈటె పట్టుకుని కాపలా కాశారు. తర్వాత ఓ గంట పాటు కీర్తనలు విన్నారు. ఆఖరిలో వంట పాత్రలు కూడా శుభ్రం చేశారు.

Also Read: తప్పు చేసిన నాయకులకు ప్రార్థనా మందిరంలో శిక్షలేంటీ- అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి!

సుఖ్‌బీర్ సింగ్ బదల్‌తోపాటు మాజీ మంత్రులు బిక్రమ్ సింగ్ మజిథియా, సుఖ్ దేవ్ సింగ్ ధిండా కూడా పాత్రలను శుభ్రం చేశారు. పార్టీ నాయకులు డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా, సుర్జిత్ సింగ్ రఖ్రా, ప్రేమ్ సింగ్ చందుమజ్రా, మహేశ్ ఇందర్ గ్రేవాల్ మరుగుదొడ్లను శుభ్రం చేశారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు టాయిలెట్‌ను శుభ్రపరిచే శిక్ష కూడా విధించారు. అయితే ఆయన కాలికి గాయం కారణంగా ఆశిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. 

Continues below advertisement