పెట్రోలు ధర వంద రూపాయల దాటేసింది. వాహనదారులు భయపడిపోతున్నారు. కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా పెరిగిన ధరలతో సామాన్యూడు బంకు వెళ్లి.. పెట్రోలో పోయించుకునే ముందు బడ్జెట్ లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ పెట్రోల్ ధరలపై మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ.. పాద మాటలే చెప్పారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని వివరించారు.


Also Read: Imran Khan Endroses Taliban: పాక్ ప్రధాని రూటే సెపరేటు.. బానిస సంకెళ్లు తెంచేశారట!


యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని వెల్లడించారు.
ఐదేళ్ల కాలంలో ఆయిల్ బాండ్లపై ఎన్డీఏ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వ‌డ్డీ చెల్లించిన‌ట్లు సీతారామన్ తెలిపారు. ఇంకా రూ.1.3 ల‌క్షల కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌ని వెల్లడించారు. యూపీఏ హ‌యాంలో రూ.1.44 ల‌క్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల జారీ చేయ‌డంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గాయి.. అయితే... ఆయిల్ బాండ్ల భారం తమ ప్రభుత్వంపై పడిందని కేంద్రమంత్రి తెలిపారు. వాటి కార‌ణంగానే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌లేక‌పోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతమైతే.. ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం త‌గ్గించే స‌మ‌స్యే లేదని చెప్పారు.


Also Read: Afghan Ghani Cash : ఘనీ మామూలోడు కాదు.. పారిపోయేటప్పుడు ఎంత సొమ్ము తీసుకెళ్లారో తెలుసా..!?


తమిళనాడులా కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని రిపోర్టర్ ప్రశ్న అడిగారు. దీనికి సీతారామన్ సమాధానం ఇచ్చారు. 


మేం గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో   శ్వేత పత్రాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. కానీ ఆయిల్ బాండ్ల భారం మా ప్రభుత్వంపై పడింది.. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నారు.
                                                                                      - నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి
లీటరు పెట్రోల్ రేటుపై రూ.3 ఇంధన పన్నును తగ్గిస్తూన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల ఆ రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి రూ.1,160 కోట్ల భారం పడనుంది.


Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ మహిళలు.. టీవీ చూడొద్దట..హై హీల్స్ వేసుకోవద్దట.. ఇవేమి 'తాలిబన్' రూల్స్ రా నాయనా